తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Operation Valentine Teaser: ఇంట్రెస్టింగ్‍గా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్- ‘మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా'

Operation Valentine Teaser: ఇంట్రెస్టింగ్‍గా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్- ‘మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా'

08 January 2024, 18:15 IST

google News
    • Operation Valentine Teaser: ఆపరేషన్ వాలెంటైన్ మూవీ టీజర్ వచ్చేసింది. ఫస్ట్ స్ట్రైక్ అంటూ వచ్చిన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. 
Operation Valentine Teaser: ఇంట్రెస్టింగ్‍గా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్
Operation Valentine Teaser: ఇంట్రెస్టింగ్‍గా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్

Operation Valentine Teaser: ఇంట్రెస్టింగ్‍గా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్

Operation Valentine Teaser: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్, వైమానిక దాడులు, దేశభక్తి, ప్రేమ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీల్లో ద్విభాషా చిత్రంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కుతోంది. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ నేడు రిలీజ్ అయింది. ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఈ టీజర్ వచ్చింది.

“మన ఎయిర్ ఫోర్స్‌ను ఇంకో దేశానికి పంపించడమంటే అది యుద్ధాన్ని ప్రకటించడమే. ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు.. సరిహద్దులు మాత్రమే ఉంటాయి” అని పైలెట్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ చెప్పే మాటలతో ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ మొదలైంది. ఆ తర్వాత “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా” అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉంది. పక్క దేశంపై వైమానిక దాడి చేసే దళానికి వరుణ్ తేజ్ ఈ చిత్రంలో సారథ్యం వహించే పాత్ర చేశారు.

ఉగ్రవాదులపై వైమానిక దాడి ఈ సినిమాలో ప్రధాన హైలైట్‍గా ఉండనుంది. టీజర్లోనూ ఎయిర్ స్ట్రైక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ మానుషి చిల్లర్ కూడా ఎయిర్ ఫోర్స్ లోనే ఉద్యోగం చేస్తుంటారు. వరుణ్, మానుషి మధ్య లవ్ ఉంటుందనేలా టీజర్లో ఉంది. కెప్టెన్ రుద్రగా ఈ చిత్రంలో నటించారు వరుణ్. వైమానిక విన్యాసాలు ఈ టీజర్లో అదిరిపోయాయి. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్‌కు బాగా సూటైంది.

యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు ఆపరేషన్ వాలెంటైన్‍కు క్యాప్షన్ ఉంది. పాకిస్థాన్‍ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులకు స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ (సందీప్ ముద్దా) బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం 2024 ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం