Operation Valentine Release date: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్: గ్లింప్స్ వీడియో విడుదల-operation valentine movie new release date announced officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Operation Valentine Release Date: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్: గ్లింప్స్ వీడియో విడుదల

Operation Valentine Release date: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్: గ్లింప్స్ వీడియో విడుదల

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2023 06:21 PM IST

Operation Valentine Release date: వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వివరాలివే..

Operation Valentine Release date: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్
Operation Valentine Release date: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి కొత్త రిలీజ్ డేట్

Operation Valentine Release date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ భారీ బడ్జెట్‍తో తెరకెక్కుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెలుగు - హిందీలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. అయితే, డిసెంబర్ 8న విడుదల కావాల్సిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ యూనిట్ నేడు ప్రకటించింది.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ 2024 ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 12) వెల్లడించింది. ఓ గ్లింప్స్ వీడియో పోస్ట్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలెట్‍గా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఇండియాపై ఓ భీకర దాడి జరిగిందని ఆపరేషన్ వాలెంటైన్.. గ్లింప్స్ ప్రారంభంలో ఉంది. ఆ తర్వాత దీనికి బదులుగా భారత్ అతిపెద్ద వైమానిక దాడి చేసినట్టుగా అర్థమవుతోంది. యుద్ధ విమానాల విన్యాసాలు హైలైట్‍గా నిలిచాయి. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు క్యాప్షన్ పెట్టారు మేకర్స్. 2024 ఫిబ్రవరి 16న ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కానున్నట్టు గ్లింప్స్ చివర్లో మూవీ యూనిట్ పేర్కొంది.

కాగా, వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజై పరాజయం పాలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీంతో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వరుణ్ తేజ్‍కు చాలా కీలకంగా ఉంది. హిందీలోనూ పాపులర్ అయ్యేందుకు అతడికి ఇది మంచి అవకాశంగా ఉంది. 

Whats_app_banner