Konda Surekha Comments: కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్, నాని ఫైర్ - సమంతకు సపోర్ట్‌గా నాగచైతన్య పోస్ట్
03 October 2024, 8:47 IST
Konda Surekha Comments: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతోన్నాయి. కొండా సురేఖపై జూనియర్ ఎన్టీఆర్, నానితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అవుతోన్నాయి. సమంతకు ఆమె మాజీ భర్త నాగచైతన్య కూడా సపోర్ట్‌గా నిలుస్తూ పోస్ట్ పెట్టాడు.
కొండా సురేఖ కామెంట్స్
Konda Surekha Comments: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సినీ ప్రముఖుల జీవితాలపై ఇష్టానుసారం కామెంట్స్ చేయడం తగదని, కొండ సురేఖ బేషరతుగా అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతకు క్షమాపణలు చెప్పాలని డిమాంట్ చేస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నానితో పాటు నాగచైతన్య కూడా రియాక్ట్ అయ్యాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు - ఎన్టీఆర్
కొండా సురేఖ వ్యాఖలపై ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మినిస్టర్ కామెంట్స్‌ను తప్పుపడుతూ ట్వీట్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి తెలుగు సినిమా పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం చూస్తుంటే బాధకలుగుతుంది అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
“తమ ప్రయోజనాల కోసం వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. ఉన్నత పదవుల్లో ఉన్న మీలాంటి వ్యక్తులు హుందాగా, గౌరవంగా ఉంటే బాగుంటుంది. సినీ పరిశ్రమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఇలాంటి నిర్లక్షపూరిత ప్రవర్తనను సమాజం ఆమోదించదు” అని ఎన్టీఆర్ అన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు అంటూ హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు ఎన్టీఆర్. ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
సమాజంపై చెడు ప్రభావం...
గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తులు చేసే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని హీరో నాని అన్నాడు. “బాధ్యతల్ని విస్మరిస్తూ నాయకులు చేస్తోన్న ఇలాంటి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యం కలుగుతుందని అన్నాడు. మీ మాటల్ని చూస్తుంటే మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందని” నాని ట్వీట్ చేశాడు. నాని ట్వీట్ వైరల్ అవుతోంది.
నాగచైతన్య పోస్ట్...
నాగచైతన్య కూడా తన మాజీ భార్య సమంతకు సపోర్ట్ చేశాడు. కొండా సురేఖ కామెంట్స్‌ను ఖండించాడు. కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. “జీవితంలో విడాకులు తీసుకోవాలనే నిర్ణయం ఎంతో కఠినమైనది, బాధాకరమైనదని నాగచైతన్య అన్నాడు. చాలా ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మినిస్టర్ వ్యాఖ్యలు ఏ మాత్రం అమోదయోగ్యం కాదని, సమాజంలో మహిళలకు గౌరవం, మద్ధతు దక్కడం ముఖ్యమని” నాగచైతన్య తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఊరుకునేది లేదు...
సమంతను సపోర్ట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల, బీవీఎస్ రవి, సూర్యదేవర నాగవంశీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోగజనాల కోసం సినీ ప్రముఖులను వాడుకోవద్దని అంటున్నారు. ఇలాంటి కామెంట్స్‌ను ఇకపై సహించబోమని చెబుతోన్నారు.
తాను చేసిన కామెంట్స్ పట్ల ఇండస్ట్రీ వర్గాలు సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కొండా సురేఖ స్పందించింది. తన వ్యాఖ్యలను ఉపసహంచుకుంటున్నట్లు తెలిపింది.