NTR: మరో రెండు నెలల తర్వాతే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా షురూ...ఆలస్యానికి కారణం అదేనా
10 July 2022, 10:30 IST
ఆర్ఆర్ఆర్ (rrr) సక్సెస్ తర్వాత కొరటాల శివతో(koratala shiva) తదుపరి సినిమాను చేయబోతున్నారు ఎన్టీఆర్(ntr). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ను మాత్రం ఖరారు కాకపోవడంతో ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ 30
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా ఇదే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత జూలైలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వస్తుందని వార్తలొచ్చాయి. కానీ కొరటాల శివ చెప్పిన కథలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. అందువల్లే ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా హీరోయిన్ ఎంపిక కూడా చిత్ర యూనిట్ కు పెద్ద సమస్యగా మారింది. ఇందులో అలియాభట్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. గంగూబాయి ప్రమోషన్స్ లో అలియాకూడా ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు తనను సంప్రదించిన మాట నిజమేనంటూ చెప్పింది. పెళ్లి పనులతో బిజీగా మారిన అలియా ఈ చిత్రానికి నో చెప్పింది. మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా కాలంగా అన్వేషణ సాగిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించనున్నట్లు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నాయికల పేర్లు వినిపించాయి.
కానీ ఆ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. సమంత పేరు కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రచారం అవాస్తవమేనంటూ చిత్ర యూనిట్ తెలిపింది. రష్మిక మందన్న పేరు గట్టిగా వినిపించినా ఆమె డేట్స్ సర్ధుబాటు కావడం కష్టం కావడంతో కుదరలేదు . దాంతో హీరోయిన్ ఎంపిక కొరటాల శివకు ఛాలెంజింగ్ గా మారినట్లు చెబుతున్నారు. హీరోయిన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఆచార్య పరాజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
టాపిక్