Ntr Adavi Ramudu Re Release: ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ - రెండు రోజుల గ్యాప్‌లో బ్లాక్‌బస్టర్ మూవీస్ రీ రిలీజ్
24 May 2023, 10:33 IST
Ntr Adavi Ramudu Re Release: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బ్లాక్‌బస్టర్ మూవీ అడవిరాముడు రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
ఎన్టీఆర్ అడవిరాముడు
Ntr Adavi Ramudu Re Release: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అతడి బ్లాక్‌బస్టర్ మూవీ అడవిరాముడు రీ రిలీజ్ కానుంది. మే 28 తెలుగు స్టేట్స్‌తో పాటు ఓవర్‌సీస్‌లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ స్క్రీనింగ్ చేయబోతున్నారు. 4కే టెక్నాలజీలో ఈ సినిమాను రీ రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రింట్స్‌ను రీ మాస్టర్ చేయించినట్లు తెలిసింది.
అడివిరాముడు రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్‌ను సేవా కార్యక్రమాల కోసం వినియోగించబోతున్నట్లు చెబుతోన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో దాదాపు మూడు వందల థియేటర్లలో అడవి రాముడు రీ రిలీజ్ కానున్నట్లు తెలిసింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1977లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఎన్టీఆర్‌కు అగ్ర హీరో స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. 1970 దశకంలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా అడవిరాముడు నిలిచింది. థియేటర్లలో ఏడాదికిపైగా ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జయసుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు. అడవిరాముడుకు జంధ్యాల డైలాగ్స్ అందించడం గమనార్హం.
ఈ సినిమాలో కేవీ మహదేవన్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకొన్నాయి. దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత అడవి రాముడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుండటంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దర్శకుడిగా రాఘవేంద్రారవు కెరీర్‌లో ఇదే ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ కావడం గమనార్హం.
కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ కానుంది. కృష్ణ మూవీకి రెండు రోజుల ముందు ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ హిట్ రీ రిలీజ్ కానుండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
టాపిక్