Ntr 30 Movie Title: ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా టైటిల్ ఇదేనా
12 November 2022, 11:57 IST
Ntr 30 Movie Title: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ టైటిల్ ఏదంటే...
ఎన్టీఆర్
Ntr 30 Movie Title: ఆర్ఆర్ఆర్ (RRR)సక్సెస్ అనంతరం దర్శకుడు కొరటాల శివతో (Koratala siva) అగ్ర హీరో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు దేవర అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కథానుగుణంగానే ఈ టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం పలు టైటిల్స్‌ను పరిశీలించిన కొరటాల శివ దేవర పేరును ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 30వ (NTR 30) సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడక్షన్ డిజైనర్ సాబూ సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని చక చకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. కొరటాల శివ సినిమా కోసమే ఈ లుక్ అని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్‌ను త్వరలోనే ఫైనల్ చేయబోతున్నట్లు తెలిసింది.
తొలుత ఈ సినిమాలో అలియాభట్ (Alia bhatt) కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అలియా కూడా ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపింది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సివచ్చింది.
అలియా స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా కాలంగా అన్వేషణ సాగిస్తోంది. ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటించనున్నట్లు జాన్వీకపూర్, రష్మిక మందన్న(Rashmika Mandanna), మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుధాకర్ మిక్కలినేనితో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ 30వ సినిమాను నిర్మిస్తున్నారు.