తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr30 | కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

NTR30 | కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

21 May 2022, 16:26 IST

google News
    • జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు పలువురు పేర్లు విపిస్తున్నప్పటికీ ఈ సినిమా హీరోయిన్‌ ఇంకా ఖరారు కాలేదు.
ఎన్టీఆర్30
ఎన్టీఆర్30 (Twitter)

ఎన్టీఆర్30

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపై విడుదలయ్యే తన తర్వాతి చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొరటాల శివతో NTR30(వర్కింగ్ టైటిల్) సినిమాకు ఓకే చేసిన మన తారక్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ముందుగా కొరటాల శివతో సినిమాను పూర్తి చేయనున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

మే20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివతో చేయనున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో హీరోయిన్ గురించి సమాచారమిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించనున్న కథానాయిక కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆలియా భట్ NTR30 చిత్రంలో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా ఆలియా కూడా ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయాలనుందని తన మనస్సులో మాట బయటకు చెప్పడంతో ఆమె హీరోయిన్ అని ప్రచారం జరిగింది. కానీ చిత్రబృందం మాత్రం అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికీ ఈ సినిమాలో చేసేందుకు ఆలియా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇటీవలే రణ్‌బీర్‌తో వివాహం జరగడంతో కాస్త్ బ్రేక్ తీసుకోనుందీ ముద్దుగుమ్మ. దీంతో ఆలియా భట్ ఈ సినిమా చేయడం కష్టమే అనిపిస్తుంది.

ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి నటించనుందని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవిని NTR30లో తారక్ పక్కన చూడాలని ఆశపడుతున్నారు. మరి అన్ని కుదిరితే ఇది సాధ్యమయ్యే అవకాశముంది.

తదుపరి వ్యాసం