Hero Nithiin: ఊరమాస్ సినిమాలు నా ఇమేజ్‌కు సెట్‌కావు - నితిన్ కామెంట్స్ వైరల్
27 November 2023, 11:12 IST
Hero Nithiin: ఊర మాస్ సినిమాలు తన ఇమేజ్‌కు సెట్ కావని టాలీవుడ్ హీరో నితిన్ అన్నాడు. ఇకపై అలాంటి కథలతో సినిమాలు చేయనని తెలిపాడు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్‌లో మాస్ సినిమాలపై నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
నితిన్
Hero Nithiin: లవ్ స్టోరీస్, ఫ్యామిలీ, కామెడీ కథాంశాలతో పోలిస్తే మాస్ సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా మాస్ కథలు ఎక్కువగా వండర్స్ క్రియేట్ చేస్తుంటాయి.
అందుకే మాస్ ఇమేజ్ కోసం హీరోలందరూ ప్రయత్నిస్తుంటారు. ఈ జోనర్‌లో సినిమాలు చేసి హిట్ కొట్టాలని తపిస్తుంటారు. టాలీవుడ్ నితిన్ కూడా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని చాలా కలలు కన్నాడు. కానీ అతడి కోరిక మాత్రం నెరవేరలేదు.
గత ఏడాది రిలీజైన మాచర్ల నియోజకవర్గం మొదలుకొని ఇరవై ఏళ్ల కెరీర్‌లో నితిన్ చేసిన మాస్ యాక్షన్ మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా మిగిలాయి. ఈ మాస్ సినిమాలపై ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్‌లో నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తనకు ఊర మాస్ సినిమాలు సెట్ కావనే విషయంలో క్లారిటీ వచ్చేసిందని తెలిపాడు. ఇకపై అలాంటి కథలతో సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. ఫన్, కమర్షియల్ అంశాలతో కూడిన సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 7 రిలీజ్ అవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ ప్రేమకథతో ఈ మూవీ తెరకెక్కుతోంది.