Nindu Noorella Saavasam: మరోసారి అమర్ ఒళ్లో మిస్సమ్మ.. భాగమతిని కలిసిన కాళీ.. రాథోడ్‌ను కొట్టిన చిత్రగుప్తుడు
29 October 2023, 7:29 IST
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ 66లో పిల్లలను పిక్నిక్ తీసుకెళ్తారు అమరేంద్ర, భాగమతి. జేయింట్ వీల్ ఎక్కినప్పుడు భయపడి అమర్‌ను గట్టిగా హగ్ చేసుకుంటుంది భాగీ. తర్వాత మరోసారి అమర్ ఒళ్లో పడిపోతుంది భాగమతి.
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ 66
Nindu Noorella Saavasam Episode 66 Highlights: పిక్నిక్లో పిల్లలతో పాటు అమర్, భాగమతి కూడా జేయింట్ వీల్ ఎక్కుతారు. దాని వేగానికి భయపడి అమర్‌ని గట్టిగా పట్టుకుంటుంది మిస్సమ్మ. అది చూసిన మనోహరి, అరుంధతి షాకవుతారు. తన బాధని చిత్రగుప్తుడితో పంచుకుంటుంది అరుంధతి. చిత్రగుప్తుడు అరుంధతిని మాటల్లో పెట్టి తన ఉంగరం తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది.
భ్రమ అని నమ్మేలా
తన ఉంగరం కోసం అపసోపాలు పడుతున్న చిత్రగుప్తుడు రాథోడ్ కంటపడతాడు. ఇంటిపట్టునే కాపలా ఉండమంటే పిక్నిక్కి ఎందుకొచ్చావంటూ చిత్రగుప్తుడిని కొడతాడు రాథోడ్. తప్పించుకునే మార్గం కోసం ఆలోచిస్తాడు చిత్రగుప్తుడు. వెంటనే రాథోడ్‌కి ఎదురుతిరిగి చెంప చెళ్లుమనిపిస్తాడు. షాకయిన రాథోడ్‌ని అదంతా భ్రమ అని నమ్మేలా చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
సరదాగా ఆడుకుంటున్న పిల్లల్ని తనకోసం స్కైక్యాబ్ ఎక్కమని అడుగుతుంది భాగమతి. కానీ వాళ్లు అలాంటి చిన్నపిల్లల ఆటలు ఆడమంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తనకి తోడుగా ఎవరుంటారా అని చూస్తున్న భాగమతికి అరుంధతి కనిపిస్తుంది. వెంటనే అక్కా.. అంటూ అరుంధతి దగ్గరకు పరిగెడుతుంది. తనకోసం పిక్నిక్కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి తనతోపాటు స్కైక్యాబ్స్ ఎక్కమని అడుగుతుంది.
ఉలిక్కిపడిన మిస్సమ్మ
కానీ, తాను అది ఎక్కలేనని, చిన్నప్పుడు దానిపై నుంచి పడటం వల్ల జీవితంలో ఎక్కనని ఒట్టు పెట్టుకున్నానని చెబుతుంది అరుంధతి. ఇంతలో అమర్ అక్కడికి రావడంతో అరుంధతి దాక్కుంటుంది. అమర్ సంగతి తెలియని మిస్సమ్మ అటువైపు తిరిగి స్కై క్యాబ్స్ అంటే తనకు ఎంత ఇష్టమో, దానితో ముడిపడి ఉన్న తన తండ్రి జ్ఞాపకాల గురించి చెప్పుకుంటూ పోతుంది. వెనక్కి తిరిగి అమర్‌ని చూసి ఉలిక్కిపడుతుంది మిస్సమ్మ.
పద స్కై క్యాబ్ ఎక్కుదువు అంటూ తీసుకెళ్తాడు అమర్. ఇద్దరూ స్కై క్యాబ్ ఎక్కి ఆకాశంలో విహరిస్తారు. సంతోషంతో లేచి చుట్టూ చూస్తున్న మిస్సమ్మ తూలిపోయి అమర్ ఒళ్లో పడిపోతుంది. అది చూసి తట్టుకోలేకపోతుంది అరుంధతి. అమర్ తల్లిదండ్రులు తమ కొడుకుని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని చర్చించుకుంటూ ఉంటారు. అది విని షాకవుతుంది అరుంధతి. తన భర్తకి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన ఎందుకంటూ తనలో తానే ప్రశ్నించుకుంటుంది.
కాళీని చూస్తారా
భాగమతిని వెతుక్కుంటూ వండర్లాకి వస్తాడు కాళీ. దూరంగా కనపడిన భాగీ దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. కాళీని అమర్ కుటుంబం చూస్తే తనకు ప్రాబ్లమ్ అవుద్దని పక్కకి తీసుకెళ్తుంది భాగీ. అప్పుడే అమర్ కాళీని చూస్తాడు. భాగమతి, కాళీ మాట్లాడుకోవడం అమర్ చూస్తాడా? అమర్‌కి భాగమతి గురించి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే అక్టోబర్ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!