NNS January 20th Episode: మనోహరి ప్లాన్ సూపర్.. అయినా దొరికిన డబ్బు.. నిర్దోషిగా తేలిన మిస్సమ్మ
20 January 2024, 15:01 IST
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 20వ తేది ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తాయి. అమ్ము బ్యాగులో డబ్బులు పెట్టి రౌడీకి డబ్బులు ఇచ్చేందుకు మనోహరి ప్లాన్ వేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 20వ తేది ఎపిసోడ్
Nindu Noorella Saavasam 20th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 20th January Episode) సీసీటీవీ ఫుటేజ్ తెమ్మని అందరికీ చూపిస్తుంది మిస్సమ్మ. చూడండి సార్ నేను బయటికి వెళ్లేటప్పుడు నా చేతిలో బ్యాగు లేదు ఏమీ లేదు అంటుంది. సార్ ఎవరు బయటకు వెళ్లలేదు ఎవరు ఇంట్లోకి రాలేదు మరి డబ్బులు ఎక్కడికి పోయినట్టు అంటాడు రాథోడ్.
డబ్బు ఎవరు తీశారో
డబ్బులు బయటికి పోలేదు అంటే ఇంట్లోనే ఉంటాయి సార్ ఇల్లంతా వెతకాలి అంటుంది భాగమతి. అవును ముందు మను రూమ్ వెతకండి మన రూమ్ లోనే ఉంటాయి అంటుంది అరుంధతి. మిస్సమ్మ ఇప్పుడు డబ్బుల గొడవ ఎందుకు వదిలేయండి. నువ్వు చేయలేదని తెలిసిపోయింది కదా అంటుంది అమరేంద్ర. లేదు సార్ నేను దొంగతనం చేయలేదని మాత్రమే కాదు. డబ్బు ఎవరు తీశారు తెలుసుకోవాలి అంటుంది భాగమతి.
ఏంటి మిస్సమ్మ సమాధానం తెలుసుకునేది. ఎందుకు ఇప్పుడు ఇదంతా ఎలాగో నువ్వు డబ్బు తీయలేదని తేలిపోయింది కదా అంటుంది మనోహరి. సార్ మీరు చెప్పండి నేను డబ్బు తీయలేదని ప్రూవ్ చేసుకోవాలి. అది ఎవరు తీసారో కూడా కనిపెట్టాలి అంటుంది భాగమతి. సరే రాథోడ్ ఇల్లంతా చెక్ చెయ్ ఫస్ట్ నా రూమ్ నుంచే వెతుక్కుంటూ రా అంటాడు అమరేంద్ర. రాథోడ్ అమరేంద్ర రూమ్ చెక్ చేసి వచ్చి అందులో డబ్బులు దొరకలేదు సార్ అని చెబుతాడు. అయితే అమ్మ నాన్నల రూము వెతుకు అంటాడు అమరేంద్ర.
ఏమైనా బయటదా
అందులో కూడా వెతికి వచ్చి అందులో కూడా డబ్బులు లేవు సార్ అంటాడు రాథోడ్. అయితే ఇప్పుడు నా రూము వెతకండి రాథోడ్ అంటుంది భాగమతి. ముందు మను రూము వెతకండి మను రూమ్ లో దొరుకుతాయని అరుంధతి అంటుంది. రాథోడ్ వెళ్లి భాగమతి రూమ్ చెక్ చేసి వచ్చి అందులో కూడా డబ్బులు లేవు అని చెబుతాడు. అయితే ఇక మనోహరి రూము వెతుకు అంటాడు అమరేంద్ర. దానితో టెన్షన్ పడిపోయిన నీలా బాబు గారు ఇప్పుడు మనోహరి అమ్మ రూమ్ కూడా వెతకాల. తను ఏమైనా బయటిది కాదు కదా. ఇంట్లో మనిషి అయిపోయింది కదా అంటుంది నీలా.
పెద్దమ్మ గారు అయ్యగారు ఏమైనా బయటి వాళ్ల వాళ్ల రూం వెతకలేదా మాకు తెలియదా. మరి నువ్వు పెద్ద చెప్పొచ్చావ్ వెతకాల్సిందే అంటాడు రాథోడ్. ఇప్పుడు రూమ్ లోకి వెళ్తే డబ్బు దొరికిపోతుంది ఎలా అని మనోహరీ టెన్షన్ పడుతుంది. అమ్మగారు డబ్బు దొరికాక ఇద్దరం జైలుకు వెళ్తాము కదా. అప్పుడు నన్ను జైల్లోనే వదిలేయకుండా మీతో పాటు తీసుకురండి అమ్మ అంటుంది. నువ్వు నోరు ముయ్యవే అని కోపంతో అంటుంది మనోహరి. రాథోడ్ అ రూమ్ ని కూడా వెతికి వచ్చి డబ్బులు మనోహరి రూములో కూడా లేవు సార్ అని చెబుతాడు.
పిల్లల స్కూల్ బ్యాగ్‌లో
అమ్మగారు డబ్బు మీ రూమ్‌లో లేదు ఎక్కడ పెట్టేశారు అని అడుగుతుంది నీల. డబ్బు బయటికి ఎలాగో వెళ్లాలని వేరే ప్లాన్ వేసాను అంటుంది మనోహరి. వెళ్లి పిల్లల బ్యాగులో డబ్బులు పెట్టి రౌడీ కి ఫోన్ చేసి పిల్లలు స్కూల్ కి వస్తారు.పెద్దమ్మాయి బ్యాగులో పెట్టాను తీసుకో అని ఫోన్ చేసి అతనికి చెప్పి వచ్చి సైలెంట్ గా వీళ్ల దగ్గర నిలబడుతుంది మనోహరి. అన్ని రూముల్లో వెతికాను డబ్బు ఎక్కడా లేదు అంటాడు రాథోడ్. ఇంట్లో డబ్బు లేదు బయటికి వెళ్లలేదు డబ్బు ఏమైపోయినట్టు అంటాడు శివరామ్.
మనోహరి గదిలోనే ఉన్నాయి తనే తీసింది అని అరుంధతి ఉంటుంది. ఇక డబ్బులు విషయం వదిలేయండి పిల్లలకు స్కూలుకు టైం అవుతుంది రెడీ చేసి పంపించు మిస్సమ్మ అని అమరేంద్ర వెళ్లిపోతాడు. కట్ చేస్తే, పిల్లలు బ్యాగులు వేసుకొని కిందికి వస్తూ ఉంటే మనోహరి చూసి పదినిమిషాలైతే డబ్బు బయటకు వెళ్లిపోతుంది అని అనుకుంటుంది. పిల్లలు బ్యాగులు వేసుకొని కిందికి రాగానే రాథోడ్ గారు ఇప్పుడు డబ్బు ఎలాగో బయటికి వెళ్లలేదు కాబట్టి కారు కూడా చెక్ చేయాలి.
అక్కడ పెట్టి ఉండొచ్చు
కారులో బయటికి తీసుకువెళ్లొచ్చని ఎవరైనా పెట్టుంటారు కదా అని భాగమతి అంటుంది. మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావ్ కారులో డబ్బు ఎవరైనా పెడతారా డబ్బు దొరకలేదు కదా ఇల్లంతా చెక్ చేసా అక్కడ ఎలా దొరుకుతుంది అని మనోహరి అంటుంది. చూడండి పిల్లల్ని ఎలాగో స్కూలుకి తీసుకు వెళ్తాము కదా అని ఎవరైనా అక్కడ పెట్టి ఉండొచ్చు కదా దొంగవాడు. అందుకే చెక్ చేయమంటున్నాను అని భాగమతి అంటుంది. అంటే ఏంటి మిస్సమ్మ ఇప్పుడు కారు చెక్ చేయమంటావు తర్వాత పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే బ్యాగులు చెక్ చేయమంటావా ఏంటి అని నీలా అంటుంది.
ఏం మాట్లాడుతున్నావ్ నీలా ఏమైనా వాళ్లు నిన్ను అడిగారా సలహా ఇవ్వమని నువ్వే వాళ్లకు నన్ను పట్టించేలా ఉన్నావే అని మనోహరి కోప్పడుతుంది. బ్యాగులు చెక్ చేయడం ఏంటి మిస్సమ్మ పిల్లల్ని స్కూల్ కి వెళ్లని అంటుంది మనోహరి. పర్వాలేదు ఆంటీ మిస్సమ్మ దొంగతనం చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి కదా. డబ్బు కూడా ఎక్కడ పోయిందో తెలియాలి కాబట్టి చెక్ చేయాల్సిందే అని పిల్లలు మా బ్యాగులు కూడా చెక్ చెయ్ రాథోడ్ అంటారు.
నా బ్యాగ్ కూడా చెక్ చేయండి
రాథోడ్ అన్ని బ్యాగులు చూస్తాడు. మనోహరీ కొంప మునిగిపోతుంది డబ్బు దొరికిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా బ్యాగ్ కూడా చెక్ చేయ్ రాథోడ్ అని అమృత అంటుంది. అమృత ఇప్పుడు నీ బ్యాగు చెక్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అవమానించాలని నా ఉద్దేశం కాదు ఏం పరవాలేదు మీరు స్కూల్ కి వెళ్లండి అని భాగమతి అంటుంది. మిస్సమ్మ అన్ని బ్యాగులు చెక్ చేశారు కదా నా బ్యాగ్ కూడా చెక్ చేస్తే అయిపోతుంది ఉండు నేనే చెక్ చేస్తాను అని అమృత తన బ్యాగ్ లో చూడగానే డబ్బు కనపడుతుంది.
అది చూసి మనోహరి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఇంతలో అమరేంద్ర కిందికి వస్తాడు. డబ్బులు నా బ్యాగులో ఉన్నాయి అంటుంది అమృత. సరే డబ్బులు దొరికాయి కదా మీరు స్కూల్ కి వెళ్లండి అంటాడు అమరేంద్ర. ఓహో ఇలా ప్లాన్ చేసావా పిల్లలు ఎలాగైనా స్కూలుకు వెళ్తారు. డబ్బులు వాళ్ల బ్యాగులో పెడితే ఎవరికీ డౌటు రాదని నువ్వే ఇదంతా చేసి ఏమీ తెలియనట్టు పిల్లల బ్యాగులు చెక్ చేయిద్ధామని అన్నావు కదా మిస్సమ్మ. నువ్వే డబ్బు తీసావ్ చెప్పు నిజం అని మనోహరి దబాయిస్తుంది.
నేను తెలుసుకుంటాను
మనోహరి తను దొంగతనం చేయలేదని తేలిపోయింది కదా డబ్బు ఎలాగో దొరికింది కదా దొంగతనం చేసింది అయితే డబ్బు వెతకాలి అని తను ఎందుకు అంటుంది. నిజం తెలుసుకోకుండా ఒకరిని అలా అనకూడదు అని అమరేంద్ర అంటాడు. డబ్బు ఎవరు తీసారో తెలియాలి కదా అమర్ అని మనోహరి అంటుంది. అది నేను తెలుసుకుంటాను. మిస్సమ్మ నువ్వు పిల్లల్ని స్కూల్ కి పంపించేసేయ్ అంటాడు అమర్.
మనోహరిని నిలదీస్తుంది మిస్సమ్మ. డబ్బులు తీసింది మనోహరి అని మిస్సమ్మకు అరుంధతి చెబుతుందా? మనోహరి తర్వాతి ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే జనవరి 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!