తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikhil Siddhartha: మరోసారి వాయిదా పడిన కార్తికేయ-2.. ఎప్పుడొస్తుందంటే?

Nikhil Siddhartha: మరోసారి వాయిదా పడిన కార్తికేయ-2.. ఎప్పుడొస్తుందంటే?

04 August 2022, 15:52 IST

google News
    • హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా అనుకున్న సమయం కంటే కూడా ఓ రోజు ఆలస్యంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేయగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
కార్తికేయ 2
కార్తికేయ 2 (Twitter)

కార్తికేయ 2

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. 2014లో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ మారింది. ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలియజేయగా.. తాజాగా ఓ రోజు ఆలస్యంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

ఆగస్టు 13న విడుదల కానున్నట్లు కార్తికేయ-2 చిత్రబృందం ప్రకటించింది. ఈ మిస్టికల్ అడ్వెంచర్ కార్తికేయ-2 ఆగస్టు 13న విడుదల కానుంది. అంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తొలుత ఈ సినిమాను జులై 22న విడుదల చేయా3లని మేకర్స్ భావించారు. అప్పుడు నాగచైతన్య థ్యాంక్యూ పోటీగా ఉండటంతో వాయిదా పడింది. చివరకు పలు డేట్లు అనుకోని చివరకు ఆగస్టు 12 లాక్ అయింది. కానీ అప్పుడు కూడా కాకుండా ఓ రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తికేయ.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. అయితే సినిమా ప్రచారంలో కేవలం నిఖిల్ మాత్రమే పాల్గొంటుండగా.. అనుపమ మాత్రం రావట్లేదు. ఈ విషయంపై సదరు హీరోయిన్‌ ఇన్‌స్టా వేదికగా వివరణ ఇచ్చింది. . టైట్ షెడ్యూల్ కారణంగా రాత్రి-పగలు షూటింగ్‌లోనే ఉండాల్సి వస్తుందని, ఎప్పటి నుంచో ఇతర నటీ, నటులు డేట్లు ఫిక్స్ అవ్వడంతో ప్రమోషన్లకు రాలోకపోతున్ననంటూ స్పష్టం చేసింది.

ఈ సినిమాను చందూ మొండేటి తరెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదల కానుందీ చిత్రం.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం