తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే

29 August 2022, 10:30 IST

google News
  • OTT Releases This Week: ఈ వారం పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే....

ఓ మంచి రోజు చూసి చెప్తా
ఓ మంచి రోజు చూసి చెప్తా (Twitter)

ఓ మంచి రోజు చూసి చెప్తా

OTT Releases This Week:

రిపీట్ (Repeat movie) - ఆగ‌స్ట్ 25 - డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

న‌వీన్ చంద్ర‌, మ‌ధుబాల‌, అచ్యుత్ కుమార్ ప్ర‌ధాన న‌టించిన రిపీట్ చిత్రం ఆగ‌స్ట్ 25న డిస్నీ ప్ల‌స్‌హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్‌కానుంది. ఉద్యోగంలో చేరిన తొలిరోజు త‌న‌కు ఛాలెంజింగ్‌గా నిలిచిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ కేసును ఓ ఐపీఎస్ అధికారి ఎలా సాల్వ్ చేశాడ‌నే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మిళంలో ఇటీవల విడుదలైన డెజావు ఆధారంగా రిపీట్ సినిమా రూపొందింది.

హెభాప‌టేల్ ఓదెల రైల్వేస్టేష‌న్ (Odela Railway Station) - ఆగ‌స్ట్ 26 - ఆహా

ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, . స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చిన తాజా చిత్రం ఓదెల రైల్వేస్టేష‌న్‌. హెభాప‌టేల్‌, సాయిరోన‌క్‌, వ‌శిష్ట సింహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 26న ఆహా ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. రియ‌లిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు అశోక్‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఓ మంచి రోజు చూసి చెప్తా - ఆగ‌స్ట్ 26 - ఆహా

విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తిక్‌, నిహారిక కొణిదెల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఓ మంచి రోజు చూసి చెప్తా సినిమా ఆహా ఓటీటీలో ఈ నెల 26న రిలీజ్ కానుంది. త‌మిళ చిత్రం ఒరు న‌ల్ల నాల్ పాథు సొల్రెన్ కు అనువాదంగా రూపొందిన ఈ చిత్రానికి అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతోనే నిహారిక కొణిదెల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

OTT Releases This Week

కురుత్తిఆట్ట‌మ్ - ఆగ‌స్ట్ 26 - ఆహా త‌మిళ్‌

హిట్ ది ఫ‌స్ట్ కేస్(Hit the first case )- ఆగ‌స్ట్ 28 - నెట్‌ఫ్లిక్స్‌

సిల్వెస్ట‌ర్ స్టాలోన్ సామ‌రిట‌న్ - ఆగ‌స్ట్ 26 - అమెజాన్ ప్రైమ్‌

ఢిల్లీ క్రైమ సీజ‌న్ 2 - ఆగ‌స్ట్ 26 - నెట్‌ఫ్లిక్స్‌

మ‌హారాణి సీజన్ 2 - ఆగ‌స్ట్ 25 - సోని లివ్‌

క్రిమిన‌ల్ జ‌స్టిస్ - ఆగ‌స్ట్ 26 - డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

మీ టైమ్ - ఆగ‌స్ట్ 26 - నెట్‌ఫ్లిక్స్‌

ల‌వింగ్ ఆడ‌ల్ట్స్ - ఆగ‌స్ట్ 26 - నెట్‌ఫ్లిక్స్‌

పార్ట్‌న‌ర్ ట్రాక్ - ఆగ‌స్ట్ 26 - నెట్‌ఫ్లిక్స్‌

ఫియ‌ర్ లెస్ ది ఇన్ సైడ్ స్టోరీ ఆఫ్ ది ఏఎఫ్ఎల్‌డ‌బ్ల్యూ - ఆగ‌స్ట్ 26 - అమెజాన్ ప్రైమ్‌

అప‌రాజితో - ఆగ‌స్ట్ 25 - జీ5

తదుపరి వ్యాసం