తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Lokesh Kanagaraj Movie: ఖైదీ ద‌ర్శ‌కుడితో న‌య‌న‌తార హార‌ర్ సినిమా

Nayanthara Lokesh Kanagaraj Movie: ఖైదీ ద‌ర్శ‌కుడితో న‌య‌న‌తార హార‌ర్ సినిమా

28 December 2022, 14:27 IST

google News
  • Nayanthara Lokesh Kanagaraj Movie: విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌తో న‌య‌న‌తార ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు మొద‌లుకానుందంటే....

న‌య‌న‌తార
న‌య‌న‌తార

న‌య‌న‌తార

Nayanthara Lokesh Kanagaraj Movie: ఖైదీ, విక్ర‌మ్ విజ‌యాల‌తో కోలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్ లిస్ట్‌లో చేరిపోయాడు లోకేష్ క‌న‌క‌రాజ్‌(Lokesh Kanagaraj). ప్ర‌స్తుతం అత‌డితో సినిమాలు చేసేందుకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ టాప్ హీరోలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లొకేష్ క‌న‌క‌రాజ్ గత చిత్రం విక్ర‌మ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఐదు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత విజ‌య్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు లొకేష్ క‌న‌క‌రాజ్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. తాజాగా లొకేష్ క‌న‌క‌రాజ్ నిర్మాత‌గా మార‌బోతున్న‌ట్లు తెలిసింది. హార‌ర్ క‌థాంశంతో ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార‌తో పాటు లారెన్స్(Raghava Lawrence) ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ హార‌ర్ సినిమాను క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్స్‌తో క‌లిసి లొకేష్ క‌న‌రాజ్ నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అంతేకాకుండా న‌య‌న‌తార సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ స్వ‌యంగా క‌థ‌ను అందిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ర‌త్న‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వినికిడి.

న‌య‌న‌తార‌, లారెన్స్ క‌లిసి సినిమా చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం లారెన్స్ చంద్ర‌ముఖి -2 సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు న‌య‌న‌తార జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు.

తదుపరి వ్యాసం