Love Mouli Movie: నవదీప్ మూవీలో ముద్దుల లెక్కపై క్రేజీ బజ్.. అర్జున్ రెడ్డిని దాటేయనుందట.. ఎన్ని ఉంటాయంటే!
02 June 2024, 20:36 IST
- Love Mouli Movie - Navdeep: నవదీప్ హీరోగా లవ్ మౌళి చిత్రం రానుంది. అయితే, సినిమాలో ముద్దుల లెక్కపై బజ్ బయటికి వచ్చింది. ముద్దుల విషయంలో అర్జున్ రెడ్డిని ఈ మూవీ దాటేయనుందని తెలుస్తోంది. ఆ వివరాలివే..
Love Mouli Movie: నవదీప్ మూవీలో ముద్దుల లెక్కపై క్రేజీ బజ్
Love Mouli Movie: హీరోగా కెరీర్ ఆరంభించిన నవదీప్.. మొదట్లో మంచి విజయాలే సాధించారు. అయితే, ఆ తర్వాత వరుస పరాజయాలు పలుకరించటంతో చాలా ఏళ్లుగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు నవదీప్ హీరోగా మరో సినిమా వస్తోంది. ‘లవ్ మౌళి’ సినిమా రిలీజ్‍కు కూడా రెడీ అయింది. జూన్ 7వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. గతంలో వచ్చిన ట్రైలర్‌తో ఈ చిత్రం బోల్డ్‌గా ఉంటుందని అర్థమైంది. అయితే, లవ్ మౌళి అంతకు మించి ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో ముద్దు లెక్కపై తాజాగా ఇంట్రెస్టింగ్ టాక్ వెల్లడైంది.
ఎన్ని ముద్దులంటే?
లవ్ మౌళి చిత్రంలో లిప్‍లాక్ సీన్ల విషయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‍లో హాట్ టాపిక్‍గా మారింది. ఈ సినిమాలో ఏకంగా 43 ముద్దు సీన్లు ఉంటాయని సమాచారం చక్కర్లు కొడుతోంది. అంటే, సినిమాలో ఎక్కువ భాగం రొమాంటిక్ సీన్లే ఉంటాయని అర్థమవుతోంది. ట్రైలర్‌లోనే లిప్‍లాక్‍లు ఎక్కువగా ఉండగా.. సినిమాలో అంతకు మించి ఘాటుగా ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా లవ్ మౌళి ముద్దుల లెక్క బజ్ క్రేజీగా ఉంది.
అర్జున్ రెడ్డిని మించిపోయి..
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో 20కుపైగా లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ మితిమీరిన బోల్డ్‌గా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముద్దుసీన్లపై రచ్చ కూడా సాగింది. అయితే, ఇప్పుడు లవ్ మౌళి సినిమా లిప్ కిస్‍ల విషయంలో అర్జున్ రెడ్డి రికార్డును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. లవ్ మౌళి చిత్రంలో 42 ముద్దులు ఉంటాయని ఇన్‍సైడ్ వర్గాల నుంచి టాక్ బయటికి వచ్చింది.
'ఏ' సర్టిఫికేట్.. రన్‍టైమ్ ఇదే
లవ్ మౌళి సినిమా సెన్సార్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సెన్సార్ పనుల నుంచే ఈ ముద్దు సీన్లకు సంబంధించిన లెక్కలు బయటికి వచ్చాయి. లవ్ మూళి మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది
లవ్ మౌళి చిత్రం 2 గంటల 25 నిమిషాల (145 నిమిషాలు) రన్‍టైమ్‍తో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడున్న బజ్‍ను బట్టి చూస్తే ఎక్కువ భాగం బోల్డ్ సీన్లే ఉండనున్నట్టు అర్థమవుతోంది.
లవ్ మౌళి మూవీలో నవదీప్ సరసన పంఖురి గిద్వానీ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంలో పెయింటింగ్ ఆర్టిస్టుగా నవదీప్ కనిపించనున్నారు. ప్రేమ కోసం పరితపించే ఇంటెన్స్ రోల్ చేశారు. ట్రైలర్ ఏప్రిల్‍లోనే వచ్చింది. ఏప్రిల్ 19నే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 7వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
లవ్ మౌళి చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు. సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితమే మొదలైంది. అయితే, వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.