Ravi Teja: రవితేజ సినిమాకు గెస్ట్‌గా మెగాస్టార్ ప్లేస్ లో నాచురల్ స్టార్ - కారణం అదేనా
24 July 2022, 12:28 IST
రవితేజ (ravi teja) హీరోగా నటిస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ (rama rao on duty )సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు (ఆదివారం) హైదరాబాద్ జరుగనున్నది. ఈ ప్రీరిలీజ్ వేడుకకు గెస్ట్‌గా ఎవరు హాజరుకానున్నరంటే...
రవితేజ, నాని
ramarao on duty pre release event: ప్రస్తుతం రవితేజ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అతడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ సినిమా ఈ నెల 29న రిలీజ్‌కానుంది. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని చర్చిస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరుగనున్నది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరుకానున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మెగా 154 సినిమాలో చిరంజీవి తో కలిసి రవితేజ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామరావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి రావడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రావడం లేదు. అతడి స్థానంలో నాచురల్ స్టార్ నాని గెస్ట్‌గా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరుగనున్నది.
ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు చిరంజీవి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమిర్‌ఖాన్‌తో పాటు చిరంజీవి పాల్గొననున్నారు. ఆమిర్ ఖాన్ సినిమా ఈవెంట్ కారణంగానే రామారావు ఆన్‌డ్యూటీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరుకావడం లేదని సమాచారం. అందువల్లే మెగాస్టార్ ప్లేస్‌లో నాని హాజరుకాబోతున్నట్లు చెబుతున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశ కౌషిక్,రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
టాపిక్