తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prathinidhi 2: పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి 2.. సరైన సమయంలో వస్తున్నామన్నామంటూ!

Prathinidhi 2: పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి 2.. సరైన సమయంలో వస్తున్నామన్నామంటూ!

Sanjiv Kumar HT Telugu

10 May 2024, 9:42 IST

    • Actor Dinesh Tej About Prathinidhi 2: పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ప్రతినిధి 2 సరైన సమయంలో వస్తోందంటి యాక్టర్ దినేష్ తేజ్ తెలిపాడు. ఇవాళ ప్రతినిధి 2 విడుదల సందర్భంగా మే 9న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి 2.. సరైన సమయంలో వస్తున్నామన్నామంటూ!
పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి 2.. సరైన సమయంలో వస్తున్నామన్నామంటూ!

పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి 2.. సరైన సమయంలో వస్తున్నామన్నామంటూ!

TV5 Murthy About Prathinidhi 2: హీరో నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ.. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు అలియాస్ టీవీ5 మూర్తి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. సిరి లెల్ల హీరోయిన్‌గా నటించారు.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి అంచనాలు నెలకొల్పాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రతినిధి 2 సినిమా మే 10న అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మే 9న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

"మా నిర్మాతలు కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ గారు ఎక్కడా రాజీపడకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాని నిర్మించారు. హీరో రోహిత్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌లో ప్రేక్షకులు చూశారు. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు హీరోయిన్‌గా తెలుగమ్మాయికికే అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. అందుకే సిరిని ఎంపిక చేశాం" అని డైరెక్టర్ మూర్తి దేవగుప్తము అన్నారు.

"దినేష్, అజయ్ ఘోష్, సచిన్ కేడ్కర్, జిషు సేన్ గుప్తా, ఇంద్రజ, సప్తగిరి ఇలా ప్రముఖ నటీనటులు చాలా ముఖ్యమైన పాత్రలలో అద్భుతంగా నటించారు. నటీనటులు, మ్యూజిక్ సాగర్, ఎడిటర్ రవితేజ.. ఇలా అందరూ సీనియర్లు. యూనిట్‌లో జూనియర్ నేనే. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. అయితే వారందరూ అనుభవం ఉన్న వారు కావడంతో నా పని తేలికయింది" అని డైరెక్టర్ టీవీ5 మూర్తి తెలిపారు.

"ప్రతినిధి 2లో జర్నలిస్ట్ హీరో. ప్రతి జర్నలిస్ట్‌కి ప్రతిరూపంగా ఇందులో హీరో పాత్ర ఉంటుంది. జర్నలిస్ట్ సమాజంపై బాధ్యతతో ఉద్యోగం చేస్తాడు. ఇందులో హీరో అదే బాధ్యతతో పని చేస్తాడు. ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. కచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది" అని డైరెక్టర్ మూర్తి చెప్పుకొచ్చారు.

"మూర్తి గారు నాకు పెద్దన్న లాంటి వారు. ఇందులో ఓ పాత్ర కోసం నన్ను అనుకోని కథ చెప్పినప్పుడు నేను స్టన్ అయ్యాను. ఈ సినిమా తర్వాత మూర్తి గారు పరిశ్రమలో మరో మంచి దర్శకుడు అవుతారు. నిర్మాతలకు ధన్యవాదాలు. రోహిత్ అన్న సినిమాలన్నీ బాధ్యతతో కూడి ఉంటాయి. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మంచి సినిమాతో సరైన సమయంలో వస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అని యాక్టర్ దినేష్ తేజ్ అన్నారు.

"ప్రతినిధి 2 చాలా బాగా వచ్చింది. చాలా మంచి సినిమా చేశామని భావిస్తున్నాం. రోహిత్ గారు మంచి కంటెంట్‌తో మళ్లీ అలరించబోతున్నారు. దర్శకుడు మూర్తి గారు అద్భుతమైన సబ్జెక్ట్‌తో వచ్చారు. ఈ సినిమా చేయడానికి యూనిట్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ఇందులో పాత్రలన్నీ గొప్పగా ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం" అని నిర్మాత కుమార్ రాజా బత్తుల తెలిపారు.

"ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు మూర్తి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అని హీరోయిన్ సిరిలెల్లా తెలిపారు. "సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులంతా చూసి గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని నిర్మాత ఆంజనేయులు చెప్పుకొచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం