AAP Gujarat CM candidate: ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థి ఈటీవీ మాజీ జర్నలిస్ట్-isudan gadhvi is aap s chief minister candidate for gujarat polls kejriwal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aap Gujarat Cm Candidate: ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థి ఈటీవీ మాజీ జర్నలిస్ట్

AAP Gujarat CM candidate: ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్థి ఈటీవీ మాజీ జర్నలిస్ట్

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 05:13 PM IST

AAP Gujarat chief minister candidate: గుజరాత్ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ తన సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించింది.

ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢవీ
ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢవీ

AAP Gujarat chief minister candidate: గుజరాత్ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ప్రకటించింది. పార్టీ నేషనల్ సెక్రటరీ ఇసుదాన్ గఢవీని సీఎం అభ్యర్థిగా ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

AAP Gujarat chief minister candidate: మెజారిటీ ఎంపిక..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలని ఆప్ నిర్వహించిన పోల్ సర్వేలో 73 శాతం ఇసుదాన్ గఢవీకి అనుకూలంగా ఓటేశారని కేజ్రీవాల్ తెలిపారు. మొత్తం 16 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజలు ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిల్ మెయిల్, ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ను కూడా ఇదే తరహాలో ఎంపిక చేశామని కేజ్రీవాల్ గుర్తు చేశారు.

AAP Gujarat chief minister candidate: ఈటీవీ జర్నలిస్ట్

ఇసుదాన్ గఢవీ గతంలో టీవీ న్యూస్ యాంకర్ గా పని చేశారు. గఢవీ ద్వారక జిల్లాలోని పిపాలియా గ్రామానికి చెందిన ఓబీసీ నేత. గుజరాత్ లో దాదాపు 48% జనాభా ఓబీసీలే. గఢవీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. గతంలో టీవీ న్యూస్ యాంకర్ గా, జర్నలిస్ట్ గా పని చేశారు. దూరదర్శన్ పాపులర్ షో ‘యోజన’లో పని చేశారు. 2007 నుంచి 2011 వరకు ఈ టీవీ గుజరాత్ లో పోర్ బందర్ రిపోర్టర్ గా ఉద్యోగం చేశారు. గుజరాత్ కు చెందిన వీటీవీలో పాపులర్ ప్రైమ్ టైమ్ షో ‘మన్ మంథన్’ ను హోస్ట్ చేశారు. 2021 జూన్ లో ఆప్ లో చేరారు.

AAP Gujarat chief minister candidate: డిసెంబర్ లో ఎన్నికలు

ఆప్ శుక్రవారం 10 నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు 118 స్థానాలకు ఆప్ అభ్యర్థులు ఖరారయ్యారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

IPL_Entry_Point