తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avika Gor Ugly Story: నందు, అవికా గోర్ హ్యాట్రిక్ కాంబోలో అగ్లీ స్టోరీ - ఇంట్రెస్టింగ్‌గా గ్లింప్స్‌

Avika Gor Ugly Story: నందు, అవికా గోర్ హ్యాట్రిక్ కాంబోలో అగ్లీ స్టోరీ - ఇంట్రెస్టింగ్‌గా గ్లింప్స్‌

25 December 2023, 14:37 IST

google News
  • Avika Gor Ugly Story: నందు, అవికా గోర్ జంట‌గా న‌టిస్తోన్న అగ్లీస్టోరీ మూవీ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌, క‌ల‌ర్ టైమ్ పీరియ‌డ్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఈ గ్లింప్స్ సాగింది.

నందు, అవికా గోర్
నందు, అవికా గోర్

నందు, అవికా గోర్

Avika Gor Ugly Story: మాన్ష‌న్ 24, వ‌ధువు వెబ్ సిరీస్‌ల‌లో జంట‌గా క‌నిపించారు నందు, అవికాగోర్‌. ఈ సిరీస్‌ల‌లో త‌మ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్న ఈ జోడీ డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ వ‌చ్చే ఏడాది సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. నందు, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న అగ్లీ స్టోరీ మూవీ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చ‌శారు. . నందు, అవికాగోర్ వ‌ర్షంలో త‌డుస్తూ ప్రేమ‌లో మునిగిపోయిన‌ట్లు ఈ గ్లింప్స్‌లో క‌నిపిస్తోంది.

వారిని నందు వ‌చ్చి గ‌న్‌తో షూట్ చేసిన‌ట్లుగా చూపించారు. ఒక సీన్ బ్లాక్ అండ్ వైట్‌లో, మ‌రో సీన్ క‌ల‌ర్ ఫార్మెట్‌లో సాగ‌డం, రెండింటిని లింక్ చేయ‌డం ఆస‌క్తిని పంచుతోంది. నా ఇమాజినేష‌న్‌లో ఉన్న ప్రేమ నా రియ‌ల్ లైఫ్‌లో లేదు. నాకే కాదు ఇక్క‌డ చాలా మందికి ఉండ‌దు అంటూ గ్లింప్స్‌లో నందు చెప్పిన డైలాగ్ ఆస‌క్తిని పంచుతోంది. అగ్లీ స్టోరీ సినిమాతో ప్ర‌ణ‌వ్ స్వ‌రూప్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. 2024 ఆరంభంలోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అగ్లీ స్టోరీ సినిమాలో ర‌వితేజ మ‌హాదాస్యం, శివాజీ రాజా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ తో క‌లిసి సుభాషిని, కొండా ల‌క్ష్మ‌ణ్ నిర్మిస్తున్నారు.

తదుపరి వ్యాసం