తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nbk 107 Title Announcement: Nbk 107 టైటిల్ ప్రకటన.. మరోసారి పవర్‌ఫుల్ టైటిల్‌తో బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే

NBK 107 Title Announcement: NBK 107 టైటిల్ ప్రకటన.. మరోసారి పవర్‌ఫుల్ టైటిల్‌తో బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే

21 October 2022, 21:32 IST

google News
    • NBK 107 Title Announcement: బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 107. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే పేరును ఖరారు చేశారు.
NBK 107 టైటిల్ ఖరారు
NBK 107 టైటిల్ ఖరారు

NBK 107 టైటిల్ ఖరారు

NBK 107 Title Announcement: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఇంతవరకు చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించలేదు. మధ్య మధ్యలో గ్లింప్స్, ఫస్ట్ లుక్, టీజర్ ఇలా ఎన్ని విడుదల చేసినప్పటికీ సినిమా టైటిల్‌ను మాత్రం గోప్యంగా ఉంచింది. NBK 107 అనే వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ జరిగింది. ఎట్టకేలకు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. NBK107 టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. వీర సింహారెడ్డి(Veera SimhaReddy) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు.

టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. అభిమానుల సమక్షంలో సినిమా పేరును ప్రకటించారు. ఇందుకు కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా మారింది. క్రాక్ విజయంతో ఫామ్‌లోకి వచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. బాలకృష్ణను ఈ చిత్రంలో ఏ విధంగా చూపించనున్నాడో ఆత్రుతతో మొదలైంది.

ఇప్పటికే టీజర్‌తో బాలకృష్ణ లుక్‌ను బయటకు పరిచయం చేశారు మేకర్స్. తాజాగా టైటిల్ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. గతేడాది అఖండతో సూపర్ సకెస్స్ అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ షో ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. దీంతో వీర సింహారెడ్డి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు. ఇప్పటి వరకు nbk107 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంది.

తదుపరి వ్యాసం