తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna-akhil Movie: అఖిల్ తో నాగ్ సినిమా - ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసేశారు

Nagarjuna-Akhil movie: అఖిల్ తో నాగ్ సినిమా - ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసేశారు

26 September 2022, 11:01 IST

google News
  • Nagarjuna: అఖిల్ తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు. ఆదివారం క‌ర్నూల్ లో జ‌రిగిన ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ తో త‌న కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశాడు. ది ఘోస్ట్ సినిమా అక్లోబ‌ర్ 5న రిలీజ్ కానుంది.

అఖిల్, నాగార్జున, నాగచైతన్య
అఖిల్, నాగార్జున, నాగచైతన్య (twitter)

అఖిల్, నాగార్జున, నాగచైతన్య

Nagarjuna: ది ఘోస్ట్ సినిమాతో ద‌స‌రా కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈసినిమాకు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ది ఘోస్ట్ రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను క‌ర్నూల్ లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో తనయుడు అఖిల్ తో త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు.

నాగార్జున మాట్లాడుతూ ‘33 సంవ‌త్స‌రాల క్రితం అక్టోబ‌ర్ 5న శివ అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాను. అప్పుడు చైన్ ప‌ట్టుకొని వ‌చ్చా. మ‌ళ్లీ అక్టోబ‌ర్ 5న క‌త్తితో మీ ముందుకు వ‌స్తున్నా. ది ఘోస్ట్ సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందింది.

చాలా సినిమాల్లో గ‌న్స్ ప‌ట్టుకొని క‌నిపించా. కానీ మొద‌టిసారి ఈ సినిమా కోసం ట్రైనింగ్ తీసుకున్నా. సోనాల్ చౌహాన్ కు ప‌దిహేను రోజులు మిల‌ట్రీ ట్రైనింగ్ ఇప్పించాడు దర్శకుడు ప్ర‌వీణ్‌. త‌ర్వాత సినిమాను అఖిల్ తో చేయ‌బోతున్నా. ఏజెంట్‌, ఘోస్ట్ క‌లిస్తే ఎలా ఉంటుందో వెండితెర‌పై చూస్తార‌ని అన్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది’ అని పేర్కొన్నారు.

ది ఘోస్ట్ తో పాటు అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతున్న చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమా కూడా పెద్ద విజ‌యాన్నిసాధించాల‌ని నాగార్జున అన్నాడు. నాన్న‌ను తాను ఎలాగైతే సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌ని అనుకున్నానో అదే ఫైర్‌, ఇంటెన్స్ సినిమాలో క‌నిపిస్తుంద‌ని అఖిల్ పేర్కొన్నాడు. ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ముప్ఫై ఏళ్లు దాటిన ఆయ‌న‌లోని నటన పట్ల ఆయనలో ఆక‌లి, త‌ప‌న ఇంకా త‌గ్గ‌లేద‌ని, ఇంట్లోనే మాకు మోటివేష‌న్ ఉంద‌ని నాన్నను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అఖిల్ అన్నాడు.

గ‌త నాలుగైదు నెల‌లుగా ఎప్పుడూ నాన్నను కలిసినా ఘోస్ట్ సినిమా గురించే చెప్పేవార‌ని, ఇలాంటి ఎక్సైట్‌మెంట్ ఆయ‌న‌లో చూసి చాలా రోజులు అయ్యింద‌ని నాగ‌చైత‌న్య అన్నాడు. బంగార్రాజుతో పోలిస్తే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి నాన్న ఈ సినిమా చేశారని నాగచైతన్య అన్నాడు.

తదుపరి వ్యాసం