Naga Chaitanya: నాగచైతన్య థాంక్యూ రిలీజ్ వాయిదా...కొత్త డేట్ ను ప్రకటించిన మేకర్స్
24 June 2022, 17:45 IST
నాగచైతన్య(naga chaitanya) హీరోగా నటిస్తున్న థాంక్యూ (thank you)సినిమా రిలీజ్ వాయిదాపడింది. తొలుత జూలై 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు వారాల పాటు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. కొత్త విడుదల తేదీని శుక్రవారం వెల్లడించారు.
నాగచైతన్య, మాళవికా నాయర్
మనం సినిమా తర్వాత నాగచైతన్య,దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా(raashi khanna),మాళవికానాయర్,అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ యువకుడి జీవితంలోని భిన్న దశల్లో సాగిన ప్రేమాయణాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.
ఇందులో బిజినెన్‌మెన్‌గా,క్రీడాకారుడిగా,లవర్‌బాయ్‌గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నాగచైతన్య కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. జూలై 8న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ను రెండు వారాల పాటు పోస్ట్ పోన్ చేశారు. జూలై 8న కాకుండా 22న రిలీజ్ చేయబోతున్నట్లుగా శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది.
వాయిదాకు గల కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. నిర్మాణానంతర కార్యక్రమాల పూర్తికాకపోవడం వల్లనే సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు,శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు నాగచైతన్య. హారర్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నది.
టాపిక్