Naa Saami Ranga Day 1 Collection: నా సామిరంగ ఫస్ట్ డే కలెక్షన్స్ - నాగార్జున కమ్‌బ్యాక్ అదుర్స్ - రికార్డ్ బ్రేక్
15 January 2024, 10:29 IST
Naa Saami Ranga Day 1 Collection: నాగార్జున నా సామిరంగ మూవీ ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లు తెలిసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్‌గా 9 కోట్లకుపైగా గ్రాస్‌ను, నాలుగు కోట్ల ముప్ఫై లక్షల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
నాగార్జున నా సామిరంగ
Naa Saami Ranga Day 1 Collection: నాగార్జున నా సామిరంగ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. గుంటూరు కారం, హనుమాన్‌తో పాటు సైంధవ్ సినిమాల పోటీని తట్టుకొని డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలిసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 9 కోట్లకుపైగా గ్రాస్‌ను, నాలుగు కోట్ల ముప్ఫై లక్షల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నైజాంలో ఆదివారం రోజు నాగార్జున మూవీకి కోటి ఇరవై లక్షల వరకు వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
నైజాం తర్వాత అత్యధికంగా ఓవర్‌సీస్‌లో కోటి వరకు నా సామిరంగకు కలెక్షన్స్ వచ్చాయని చెబుతోన్నారు. సీడెడ్‌లో 85 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 60 లక్షలు, వైజాగ్‌లో యాభై లక్షల వరకు ఫస్ట్ డే నా సామిరంగ షేర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. వెస్ట్ గోదావరిలో 30, కృష్ణాలో 23 లక్షల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.
ఓవరాల్‌గా ఫస్ట్ డే నాలుగు కోట్ల ముప్ఫై లక్షల వరకు ఈ సినిమా షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నా సామిరంగకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రీసెంట్ టైమ్‌లో నాగార్జున కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నా సామిరంగ రికార్డ్ క్రియేట్ చేసింది.
మాస్ రోల్‌లో నాగార్జున...
నా సామిరంగంలో కిష్టయ్యగా ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో నాగార్జున నటించాడు. అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు డైలాగ్స్, హీరోయిజం అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. నాగార్జున, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో ఫ్రెండ్‌షిప్ సీన్స్ బాగున్నాయంటూ ఫ్యాన్స్ చెబుతోన్నారు.
అంజిగా అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు దక్కుతోన్నాయి. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో అచ్చమైన సంక్రాంతి మూవీగా దర్శకుడు విజయ్ బిన్నీ నా సామిరంగను తెరకెక్కించాడు. నా సామిరంగంలో అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ మరో హీరోలుగా నటించారు. నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించిన ఈ మూవీలో మీర్నామీనన్, రుక్సర్ థిల్లన్ కీలక పాత్రలు పోషించారు.
మలయాళం రీమేక్...
మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా నా సామిరంగ మూవీ తెరకెక్కింది. మలయాళ రీమేక్‌తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. క్లైమాక్స్‌ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా సాడ్ ఎండింగ్‌గా కాకుండా డిఫరెంట్‌గా ముగించారు. నా సామిరంగ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిచగా చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చాడు.
ఏడాదిన్నర బ్రేక్...
నా సామిరంగకు ముందు ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు నాగార్జున. బంగార్రాజుతో 2022 సంక్రాంతికి పెద్ద విజయాన్ని అందుకున్నాడు నాగ్. ఆ తర్వాత అతడు నటించిన ది ఘోస్ట్ డిజాస్టర్‌గా నిలవడంతో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేశాడు.
నా సామిరంగ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ములతో యాక్షన్ మూవీ చేయబోతున్నాడు నాగార్జున. ఈ సినిమాలో ధనుష్ మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 25 నుంచి శేఖర్ కమ్ముల మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.