తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Buchi Babu Movie Heroine: రామ్‌చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ క‌న్ఫామ్? - సీతారామం బ్యూటీకి ఛాన్స్‌?

Ram Charan Buchi Babu Movie Heroine: రామ్‌చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ క‌న్ఫామ్? - సీతారామం బ్యూటీకి ఛాన్స్‌?

HT Telugu Desk HT Telugu

13 July 2023, 6:23 IST

google News
  • Ram Charan Buchi Babu Movie Heroine: రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీలో హీరోయిన్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా సీతారామం బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

Ram Charan Buchi Babu Movie Heroine: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కాస్టింగ్ నుంచి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం వివిధ భాష‌ల‌కు చెందిన అగ్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని రంగంలోకి దించుతోన్నారు. ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఏఆర్ రెహ‌మాన్‌ను ఫిక్స్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ మూవీకి మ్యూజిక్‌ అందించ‌బోతున్న‌ట్లు రెహ‌మాన్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. తాజాగా హీరోయిన్‌ను కూడా క‌న్ఫామ్ చేసిన‌ట్లు తెలిసింది.

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ గ్లామ‌ర్ కోణం నుంచే కాకుండా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కావ‌డంతో జాన్వీ స్థానంలో మృణాల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకోన్న‌ట్లు స‌మాచారం.

స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఉత్త‌రాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ రోల్ డిఫ‌రెంట్‌గా సాగుతోంద‌ని చెబుతోంది. ఈ క్యారెక్ట‌ర్ కోసం చ‌ర‌ణ్ మేకోవ‌ర్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని వెంక‌ట స‌తీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. సుకుమార్ రైటింగ్స్ స‌హ‌నిర్మాణ సంస్థ‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తదుపరి వ్యాసం