Monday Motivation: బైసెప్స్ చూపిస్తూ సమంత వర్కౌట్
13 June 2022, 11:51 IST
- టాలీవుడ్ నటి సమంత ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వర్కౌట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
సమంత
సండే తర్వాత వచ్చే మండే అంటే చాలా మందికి నచ్చదు. ఆదివారం బద్ధకం వదిలించుకొని సోమవారం పనులు మొదలుపెట్టడం అంత సులువు కాదు మరి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో అలా గడిపేస్తుంటారు. అలాంటి వారు కాస్త మోటివేషన్ కోసం సమంతను చూస్తే బెటర్. సండే అయినా మండే అయినా బద్ధకం లేకుండా వర్కౌట్స్ చేయడంలో సమంత తర్వాతే ఎవరైనా.
ఫిట్‌నెస్‌తోపాటు తన ఫిజిక్‌ను మెయింటేన్ చేయడానికి ప్రాధాన్యమిచ్చే సామ్.. వర్కౌట్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. వెకేషన్‌లో ఉన్నా కూడా రోజూ ఉదయాన్ని జిమ్‌లో బరువులెత్తడం, యోగాలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాను జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. రైజ్ అండ్ షైన్ అంటూ ఈ ఫొటోలో డంబెల్ పట్టుకున్న సమంత బైసెప్స్ చూడొచ్చు.
తన బాడీని ఎప్పటికప్పుడు షేప్‌లో ఉంచుకోవడానికి కఠినమైన వర్కౌట్స్ చేయడానికి కూడా ఆమె వెనుకాడదు. ఇప్పటి వరకూ అలాంటి ఎన్నో వీడియోలను కూడా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే యశోద, శాకుంతళం, ఖుషీలాంటి సినిమాలతో ఆమె బిజీగా ఉంది. అంతేకాదు వరుణ్ ధావన్ సరసన రాజ్ నిడమూరు, కృష్ణ డీకే డైరెక్షన్‌లో వస్తున్న మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాతో హాలీవుడ్‌లోనూ అడుగు పెడుతోంది.