Samantha | సోషల్ మీడియా ద్వారా సమంత ఆర్జిస్తున్న ఆదాయం ఎంతో తెలుసా...
10 June 2022, 12:17 IST
సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణాదిన అత్యధిక ఫాలోవర్స్ కలిగిన కథానాయికల్లో సమంత ఒకరు. ఇన్స్టాగ్రామ్ ద్వారా బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసినందుకు సమంత భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఆమె సంపాదన ఎంతంటే..
సమంత
సోషల్ మీడియా కారణంగా సినిమా తారలకు,అభిమానులకు మధ్య దూరం తగ్గింది. తమ కొత్త సినిమా ముచ్చట్లు,వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులతో పంచుకోవడానికి ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌లను వారధిగా ఉపయోగించుకుంటున్నారు తారలు. సోషల్ మీడియాను అభిరుచులు,అభిప్రాయాలను షేర్ చేయడానికి వేదికగా మాత్రమే కాకుండా ఆదాయవనరుగా మారిపోయింది. ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌లలో సినిమా తారలకు మిలియన్లలో ఫాలోవర్స్ ఉంటారు. అందుకే తమ బ్రాండ్స్‌ను సోషల్ మీడియా ద్వారా సినిమా తారల వ్యక్తిగత ఖాతాల ద్వారా ప్రమోట్ చేసేందుకు వ్యాపార సంస్థలు పోటీపడుతుంటాయి.
ఇందుకోసం హీరోహీరోయిన్లు భారీగానే పారితోషికాలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం దక్షిణాదిన సోషల్ మీడియా ద్వారా అత్యధిక పారితోషికాన్ని ఆర్జిస్తున్న కథానాయికల్లో సమంత ఒకరిగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు 23.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పలు సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది సమంత. ఇటీవలే బికినీ బ్రాండ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
బ్లాక్ కలర్ బికినీలో అందాలను ఆరబోస్తూ సమంత కనిపించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె భారీగానే ఆర్జిస్తున్నట్లు సమాచారం. బ్రాండ్స్ ను ప్రమోట్ చేసినందుకు నెలకు మూడు నుండి ఐదు కోట్లవరకు సమంత సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. సినిమాల విషయంలో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాయికల జాబితాలో టాప్ లిస్ట్ లో సమంత ఉంది. ఒక్కో సినిమాకు ఆమె మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో యశోద,శాకుంతలంతో పాటు విజయ్‌దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది సమంత.
టాపిక్