తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth Jailer - Mohan Lal: ర‌జ‌నీకాంత్‌తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న మోహ‌న్ లాల్ - జైల‌ర్ లుక్ రిలీజ్‌

Rajinikanth Jailer - Mohan lal: ర‌జ‌నీకాంత్‌తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న మోహ‌న్ లాల్ - జైల‌ర్ లుక్ రిలీజ్‌

09 January 2023, 8:07 IST

google News
  • Rajinikanth Jailer - Mohan lal: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలో మ‌ల‌యాళ అగ్ర హీరో మోహ‌న్ లాల్ న‌టిస్తోన్నాడు. అత‌డి క్యారెక్ట‌ర్ లుక్‌ను రిలీజ్ చేశారు.

మోహ‌న్ లాల్
మోహ‌న్ లాల్

మోహ‌న్ లాల్

Rajinikanth Jailer - Mohan lal: కోలీవుడ్ అగ్ర హీరో ర‌జ‌నీకాంత్‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ టైమ్ వెండితెర‌పై క‌లిసి న‌టించ‌బోతున్నారు. ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న జైల‌ర్ సినిమాలో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అత‌డి ఫ‌స్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.

ఇందులో 1980ల కాలం నాటి రెట్రో లుక్‌లో మోహ‌న్ లాల్ క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌లో చీక‌టితో నిండి ఉన్న గ‌దిలో కిటికీ వ‌ద్ద నిల్చొని సీరియ‌స్‌గా ఏదో ఆలోచిస్తున్న‌ట్లుగా మోహ‌న్ లాల్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

జైల‌ర్ సినిమాలో మోహ‌న్ లాల్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ త‌క్కువ‌గానే ఉంటుంద‌ని స‌మాచారం. అతిథిగా ఆయ‌న క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్ లాల్ క‌లిసి సినిమా చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

మోహ‌న్ లాల్‌తో పాటు క‌న్న‌డ అగ్ర న‌టుడు శివ‌రాజ్ కుమార్ కూడా జైల‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ మూడు భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. జైల‌ర్ క‌థ మొత్తం ఒక రోజు నైట్‌లో జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ జైల‌ర్‌ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. న‌ర‌సింహా త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, ర‌మ్య‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది.

ప్ర‌స్తుతం జైల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్ లాల్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తోన్నారు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్నిఅందిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న జైల‌ర్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తదుపరి వ్యాసం