తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keeravani Wins Golden Globe: నా శ్రమను నమ్ముకున్నాను.. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణీ ప్రసంగం

Keeravani wins Golden Globe: నా శ్రమను నమ్ముకున్నాను.. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణీ ప్రసంగం

11 January 2023, 10:47 IST

google News
    • Keeravani wins Golden Globe: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఎంఎం కీరవాణీ మాట్లాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న కీరవాణీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎంఎం కీరవాణీ
ఎంఎం కీరవాణీ

ఎంఎం కీరవాణీ

Keeravani wins Golden Globe: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజిన సాంగ్ కెటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ పాటను రూపొందించిన ఎంఎం కీరావాణీ ఈ పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు. అమెరికాలో కాలిఫోర్నియాలోని బెవర్లీహిల్స్‌లో జరిగిన గోల్డెన్ ప్రదానోత్సవానికి ఆర్ఆర్ఆర్ టీమ్ హాజరైంది. కీరవాణీకి అవార్డును ప్రకటించే సమయంలో జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ సహా పలువురు ఆనందం వ్యక్తం చేశారు. చప్పట్లు, కేరితంలతో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణీ మాట్లాడారు. "గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. ఈ మధురమైన సమయాన్ని నా సతీమణీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. ఈ పాటను రాసిన చంద్రబోస‌కు, నృత్యాలు సమకూర్చిన ప్రేమ్ రక్షిత్‌కు ధన్యవాదాలు. ఈ పాటలో భాగమైన రాహుల్ సిప్లీగంజ్‌, కాలభైరవకు ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడైన కాల భైరవ అద్భుతమైన సహకారం అందించాడు." అని తెలిపారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవంలో ఆర్ఆర్ఆర్ రెండు కేటగిరీలకు నామినేట్ అయింది. బెస్ నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ విభాగంతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడింది. అయితే ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డును గెలిచింది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం