తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naatu Naatu Oscar Nomination: చరిత్ర సృష్టించిన కీరవాణి-చంద్రబోస్.. ఆ విషయంలో వీరిదే రికార్డు

Naatu Naatu Oscar Nomination: చరిత్ర సృష్టించిన కీరవాణి-చంద్రబోస్.. ఆ విషయంలో వీరిదే రికార్డు

25 January 2023, 7:57 IST

    • Naatu Naatu Oscar Nomination: ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ పాట స్వరకర్త ఎంఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. ఇంత వరకు తెలుగు వారికి దక్కని ఘనతను అందుకున్నారు.
కీరవాణి-చంద్రబోస్
కీరవాణి-చంద్రబోస్

కీరవాణి-చంద్రబోస్

Naatu Naatu Oscar Nomination: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా వెస్టర్న్ ఆడియోన్స్‌కు బాగా అలరించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆస్కార్ బజ్ విపరీతంగా ఏర్పడింది. ఎట్టకేలకు మంగళవారం నాడు సాయంత్రం ఆస్కార్ 2023 అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించింది అకాడమీ బృందం. ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంపికైంది. హాలీవుడ్‌లో బాగా పాపులరైన పాటల సరసన ఈ సాంగ్ నిలిచింది. ఇంత వరకు ఏ భారతీయ పాట, ముఖ్యంగా తెలుగు సాంగ్ ఇంత వరకు ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లలేదు. తాజా ఘనతతో ఎంఎం కీరవాణి, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో కీరవాణి, చంద్రబోస్ హాజరుకానున్నారు. అన్నీ కుదిరితే అదే వేదికపై వీరిద్దరూ అవార్డు తీసుకునే అవకాశమూ లేకపోలేదు. హాలీవుడ్‌లో అగ్రగణ్యులతో పోటీ పడిన వీరు ఆస్కార్స్ నామినేషన్‌ దక్కించుకున్న సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

కీరవాణీ తన కెరీర్‌లో 200 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు. గీత రచయిత విషయానికొస్తే చంద్రబోస్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, కీరవాణీతో కలిసి ఎన్నో సూపర్ హిట్లను ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ ఎంతో విజయవంతమైంది. వీరు సాధించిన విజయం చూసి ప్రతి తెలుగువ్యక్తి గర్వపడాలి.

నాటు నాటు పాటక కీరవాణి ఆస్కార్ గెలిస్తే.. ఏఆర్ రెహమాన్ తర్వాత భారత్‌కు రెండో ఆస్కార్ తీసుకొచ్చి స్వరకర్తగా నిలుస్తారు. అయితే రెహమాన్‌కు ఆస్కార్ వచ్చింది భారత చిత్రానికి కాదు. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే విదేశీ చిత్రం కోసం అకాడమీ గెలిచారు. కాబట్టి ఈ పరంగానూ కీరవాణి చరిత్ర సృష్టించే అవకాశముంది.

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఇప్పటికే పలు అంతర్జాతీ అవార్డులు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం