తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirnaa Menon In Ugram Movie: అల్ల‌రి న‌రేష్ సినిమాలో మోహ‌న్ లాల్ హీరోయిన్‌

mirnaa menon in ugram movie: అల్ల‌రి న‌రేష్ సినిమాలో మోహ‌న్ లాల్ హీరోయిన్‌

03 September 2022, 12:29 IST

google News
  • Mirnaa Menon: హీరో అల్ల‌రి న‌రేష్, ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన నాంది చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఉగ్రం పేరుతో మ‌రో సినిమా రాబోతున్న‌ది. ఈ సినిమాలో న‌రేష్ కు జోడీగా మ‌ల‌యాళ హీరోయిన్ న‌టించ‌నుంది. ఆమె ఎవ‌రంటే..

మిర్నామీన‌న్
మిర్నామీన‌న్ (instagram)

మిర్నామీన‌న్

Mirnaa Menon: నాంది(Nandi movie) స‌క్సెస్‌ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌ (Allari Naresh),ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో ఉగ్రం పేరుతో మ‌రో సినిమా రాబోతుంది. ఇటీవ‌లే ఈసినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒంటినిండా గాయాల‌తో ఇంటెన్స్ లుక్ లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచింది. నాంది త‌ర‌హాలోనే మ‌రో డిఫ‌రెంట్ స్టోరీని ఎంచుకొని కాన్సెప్ట్ బేస్‌డ్ ఫిల్మ్‌గా ఉగ్రం రూపుదిద్దుకోనున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా మిర్నామీన‌న్ క‌థానాయిక‌గా ఎంపికైంది. ఉగ్రం సినిమాలో ఆమె హీరోయిన్ గా న‌టించ‌నున్నట్లు చిత్ర యూనిట్ శ‌నివారం ప్ర‌క‌టించింది. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్ సినిమాతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది మిర్నా మీన‌న్. త‌మిళంలో రెండు సినిమాలు చేసింది. ఉగ్రం మిర్నాకు తెలుగులో రెండో సినిమా. ప్ర‌స్తుతం ఆది సాయికుమార్ స‌ర‌స‌న క్రేజీ ఫెల్లోస్ అనే సినిమా చేస్తోంది. సెప్టెంబ‌ర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.

తొలి సినిమా విడుద‌ల‌కాక‌ముందే తెలుగులో మ‌రో చ‌క్క‌టి అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది ఈ కేర‌ళ సొగ‌స‌రి. ఉగ్రం సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో మొద‌లుకానుంది. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది,సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తదుపరి వ్యాసం