Rudramambapuram: థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా - రుద్రమాంబపురంపై మినిస్టర్ ప్రశంసలు
18 July 2023, 13:12 IST
Rudramambapuram: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన రుద్రమాంబపురం మూవీపై సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశంసలు కురిపించాడు. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ మూవీకి కథను అందించాడు.
రుద్రమాంబపురం మూవీ
Rudramambapuram: పుష్ప, రంగస్థలం ఫేమ్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తూ కథను అందించిన రుద్రమాంబపురం మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్‌పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.
మత్స్యకారుల జీవితాల్ని, వారి ఆచారాల్ని, సంప్రదాయాల్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకనిర్మాతలు ఈ సినిమాలో చూపించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా రిలీజైన మూవీస్‌లో ట్రెండింగ్‌లో రుద్రమాంబపురం ఉందని నిర్మాత నండూరి రాము పేర్కొన్నారు. థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన మంచి సినిమా ఇదని చూసిన వారందరూ ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
రుద్రమాంబపురం సినిమాకు మహేష్ బంటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజయ్ ఘోష్‌తో పాటు శుభోదయం సుబ్బరావు, అర్జున్ రాజేష్, పలాస జనార్ధన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాలో మొగిలి తిరుపతి అనే పాత్రలో అజయ్ ఘోష్ కనిపించాడు.
మత్య్సకారుల అభివృద్ధి అడ్డుగా ఉన్న తన తండ్రిని ఎదురించి ఓ కొడుకు సాగించిన పోరాటం నేపథ్యంలో అజయ్ ఘోష్ ఈ కథను రాశారు. థియేటర్లను స్కిప్ చేస్తూ జూలై 6న డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజైంది. రంగస్థలం, పుష్ప సినిమాల్లో అజయ్ ఘోష్ విలన్‌గా నటించాడు. ప్రస్తుతం పుష్ప -2 తో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.