తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మహేశ్‌కు బిల్‌గేట్స్ ఫిదా.. ఒక్క మీటింగ్‌లోనే సెట్ చేసేశాడుగా..!

Mahesh Babu: మహేశ్‌కు బిల్‌గేట్స్ ఫిదా.. ఒక్క మీటింగ్‌లోనే సెట్ చేసేశాడుగా..!

01 July 2022, 14:37 IST

    • మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్.. మహేశ్ బాబును ఫాలో అవ్వడం ప్రారంభించారు. సూపర్ స్టార్‌‍కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఈ టెక్ దిగ్గజాన్ని కలిశారు మహేశ్.
బిల్ గేట్స్ తో మహేశ్ బాబు
బిల్ గేట్స్ తో మహేశ్ బాబు (Twitter)

బిల్ గేట్స్ తో మహేశ్ బాబు

Bill Gates begin to follow Mahesh on Social Media: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను కలిసిన విషయం తెలిసిందే. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో బిల్‌గేట్స్‌ను కలిసిన మహేశ్.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇటీవలే కుటుంబంతో కలిసి అమెరికాకు విహారయాత్రకు వెళ్లిన మన ప్రిన్స్.. న్యూయార్క్‌లో ఈ అపర కుబేరుడిని కలుసుకున్నారు. ఒక్క మీటింగ్‌లోనే మన సూపర్‌స్టార్‌కు బిల్‌గేట్స్ కూడా ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో మహేశ్‌ను ఫాలో అవ్వడం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

సూపర్‌స్టార్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను బిల్‌గేట్స్ ఫాలో అవడం ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో నాలుగో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్.. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఏకైక తెలుగు స్టార్ మహేశే కావడం గమనార్హం. చాలా కాలం పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఆయన.. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు.

భార్య నమ్రతతో కలిసి బిల్‌గేట్స్‌ను కలిసిన మహేశ్.. ఆయనతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అంతేకాకుండా బిల్‌గేట్స్‌ను కలవడం నిజంగా ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

"నిజంగా బిల్‌గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. అంతేకంటే మిన్న ఎంతో వినమ్రతతో ఉంటారు. నిజంగా అందరికీ ఆయనో స్ఫూర్తి!!" అని మహేశ్ బాబు తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. బిల్‌గేట్స్‌ను కలిసినప్పుడు మహేశ్ సింపుల్ ఫార్మల్ డ్రెస్‌ను ధరించగా.. నమ్రతా శిరోద్కర్ క్యాజువల్ వేర్‌లో దర్శనమిచ్చింది.

ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు.. త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమాకు రెగ్యూలర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అమెరికా వెకేషన్‌ నుంచి తిరిగి రాగానే.. ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌ను స్టార్ చేస్తారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం