తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli-mahesh Babu: మహేష్‌ బాబుతో సినిమా ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పిన రాజమౌళి

Rajamouli-Mahesh Babu: మహేష్‌ బాబుతో సినిమా ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పిన రాజమౌళి

HT Telugu Desk HT Telugu

29 June 2022, 14:40 IST

    • Rajamouli-Mahesh Babu: టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా ఆసక్తిరేపుతున్న ప్రాజెక్టుల్లో రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌ ఒకటి. తొలిసారి సూపర్‌ స్టార్‌తో దర్శకధీరుడు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఫ్రాన్స్ కు చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులను కలిసిన రాజమౌళి
ఫ్రాన్స్ కు చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులను కలిసిన రాజమౌళి (Twitter)

ఫ్రాన్స్ కు చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులను కలిసిన రాజమౌళి

రాజమౌళి సినిమా అంటేనే ఓ అద్భుతం అనేలా పాన్‌ ఇండియా స్థాయిలో పేరు సంపాదించాడు జక్కన్న. ఈగ, బాహుబలి, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి మూవీస్‌తో అతని ప్రతిభ ప్రపంచ స్థాయికి చేరింది. అలాంటి దర్శకుడు టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకడైన మహేష్‌ బాబుతో సినిమా చేస్తున్నాడంటే సహజంగా ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ గురించి ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

అలాంటి ఫ్యాన్స్‌ కోసం రాజమౌళి తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చాడు. ప్రస్తుతానికి ఎస్‌ఎస్‌ఎంబీ29గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మహేష్‌ లీడ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన జక్కన్న.. మహేష్‌తో మూవీపై స్పందించాడు. అతను చెప్పిన దాని ప్రకారం.. ఈ సినిమా పూర్తి కావడానికి గరిష్ఠంగా మూడేళ్లు పట్టనుంది.

అంతేకాదు ఈ సినిమా కోసం కావాల్సిన 3డీ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఓ స్టూడియోను సంప్రదించినట్లు రాజమౌళి చెప్పాడు. అతని సినిమాల్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తాడన్న విషయం తెలుసు కదా. ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ ఇద్దరు హీరోలు కలిసే బ్రిడ్జ్‌ సీన్‌, క్లైమాక్స్‌లను ఎలా చిత్రీకరించారో వివరిస్తూ ఈ మధ్య వచ్చిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఆ లెక్కన మహేష్‌ మూవీలోనూ వీఎఫ్‌ఎక్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉండే అవకాశాలు ఉన్నాయి. సదరు ఫ్రాన్స్‌ స్టూడియో ప్రతినిధులను రాజమౌళి కలిసి ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అది చూసి మహేష్‌ కోసం రాజమౌళి పెద్దగానే ప్లాన్‌ చేస్తున్నాడన్న అంచనాకు వచ్చేశారు. నిజానికి జక్కన్న కూడా తాను బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే గొప్ప సినిమాను మహేష్‌తో తీస్తానని గతంలోనే ప్రకటించాడు.

దీంతో ఈ మూవీ బడ్జెట్‌ కూడా భారీగానే ఉండనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు మూడేళ్లు పడుతుందని చెప్పడమే మహేష్‌బాబు ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం