Merry Christmas OTT: 60 కోట్లకు అమ్ముడుపోయిన విజయ్ సేతుపతి మెర్రీ క్రిస్మస్ ఓటీటీ రైట్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
24 January 2024, 9:24 IST
Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను అరవై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగులు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతోందంటే?
మెర్రీ క్రిస్మస్
Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైనఈ బాలీవుడ్ మూవీ క్రిటక్స్ ప్రశంసల్ని అందుకున్నది. కానీ కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. అరవై కోట్లకు ఓటీటీ రైట్స్‌ను కొనుగులు చేసింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం మేరకు ఫిబ్రవరి 9 లేదా పదహారు నుంచి మెర్రీ క్రిస్మస్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలిసింది.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అంధాదూన్ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం అతడు దర్శకత్వం వహించిన మూవీ ఇది. ఫ్రెంచ్ నవల బర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా మెర్రీ క్రిస్మస్‌ను తెరకెక్కించారు. సింపుల్ పాయింట్ అయినా శ్రీరామ్ రాఘవన్ టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. శ్రీరామ్ రాఘవన్ కెరీర్‌లో అత్యధిక ఐఎమ్‌డీబీ ర్యాంక్‌ను దక్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మస్ నిలిచింది.
యాభై కోట్ల బడ్జెట్...
దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో మెర్రీ క్రిస్మస్ మూవీ రూపొందింది. సంక్రాంతికి భారీ పోటీ కారణంగా బాలీవుడ్ మినహా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 17 కోట్లకుపైగా వసూళ్లను సాధించి నష్టాల దిశగా సాగుతోంది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో 20 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్‌ను ఈ మూవీ రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విజయ్ యాక్టింగ్ అదుర్స్...
చాలా ఏళ్ల తర్వాత ముంబైలో అడుగుపెట్టిన ఆల్బర్ట్‌కు (విజయ్ సేతుపతి) మరియా పరిచయమవుతుంది. కొద్ది పరిచయంలోనే ఆల్బర్ట్, మరియా మధ్య అనుబంధం పెరుగుతుంది. మరియాకు దుబాయ్ నుంచి వచ్చిన అర్కిటెక్ట్‌గా తనను పరిచయం చేసుకుంటాడు అల్బర్ట్. భర్త జెరోమీపై ద్వేషంతో ఆల్బర్ట్‌ను డేట్ కోసం తన ఇంటికి తీసుకొస్తుంది మరియా. మరియా భర్త జెరోమీని ఎవరో షూట్ చేసి చంపేస్తారు.
అతడి డెడ్‌బాడీ ఇంట్లోనే మరియా, అల్బర్ట్‌లకు కనిపిస్తుంది. అసలు మరియా ఇంట్లో ఏం జరిగింది? జెరోమీని చంపింది ఎవరు? ప్రియురాలు రోజీని చంపి జైలుకు వెళ్లిన ఆల్బర్ట్ ఆ నిజం మరియా దగ్గర ఎందుకు దాచాడు? జెరోమీని చంపిన దోషిని పోలీసులు పట్టుకున్నారా? లేదా? అన్నదే మెర్రీ క్రిస్మస్ మూవీ కథ. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్‌లో విజయ్ సేతుపతి చేసిన ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీ ఇదే.