తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Holiday Homes: మెగాస్టార్‌కు గోవా, ఊటీలో హాలీడే హోమ్స్.. ఇంక ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో తెలుసా?

Chiranjeevi Holiday Homes: మెగాస్టార్‌కు గోవా, ఊటీలో హాలీడే హోమ్స్.. ఇంక ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో తెలుసా?

16 January 2023, 12:33 IST

    • Chiranjeevi Holiday Homes: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో భాగంగా తను వైజాగ్‌లో సముద్ర తీరంలో భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా తనకు గోవా, ఊటీలోనూ హాలీడే హోమ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (AK Entertainments)

మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Holiday Homes: వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి. దసరాకు గాడ్‌ఫాదర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. తాజాగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో మాస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైజాగ్ సముద్ర తీరంలో తను కొంత భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

దీంతో ఆయన త్వరలోనే తన మకాం మార్చబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. విశాఖపట్నంలో మెగాస్టార్ కేవలం హాలీడే కోసం మాత్రమే ఇల్లు నిర్మించబోతున్నారని, అంతకుమించి మరేమి లేదని స్వయంగా ఆయనే వెల్లడించారు. తను హైదరాబాద్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.

అంతేకాకుండా తనకు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయని తెలిపారు. హాలిడే కోసం గోవా, ఊటీ లాంటి ప్రదేశాల్లోనూ ఆయన గృహాలను నిర్మించుకున్నట్లు స్పష్టం చేశారు. గోవా ప్రాపర్టీలో దాదాపు సిద్ధమైందని, ఇది తన కుమారుడు రామ్ చరణ్ అభిరుచికి తగినట్లుగా నిర్మించినట్లు చెప్పారు. అయితే చాలా మందికి తెలియని విషయమేమంటే చిరంజీవికి చెన్నైలోనూ రెండు బంగ్లాలు ఉన్నాయి. హైదరాబాద్‍‌ జుబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ వీధికి సరిపోయేంత ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

కెరీర్ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలకే మొగ్గుచూపుతున్నారు. ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలు చూపించిన చేదు ఫలితమే ఇందుకు కారణం. ప్రస్తుతం మన మెగాస్టార్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాదే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం