Waltair Veerayya First Day Collection: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో రికార్డ్‌-waltair veerayya first day box office collection highest opening grosser in chiranjeevi second innings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Waltair Veerayya First Day Box Office Collection Highest Opening Grosser In Chiranjeevi Second Innings

Waltair Veerayya First Day Collection: వాల్తేర్ వీర‌య్య ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 14, 2023 02:34 PM IST

Waltair Veerayya First Day Collection: చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య సినిమా తొలి రోజు యాభై కోట్ల మార్కును క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు గురువారం వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

చిరంజీవి
చిరంజీవి

Waltair Veerayya First Day Collection: లాంగ్ గ్యాప్ త‌ర్వాత వాల్తేర్ వీర‌య్య సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. మొద‌టి రోజే ఈ సినిమా యాభై కోట్ల మార్కు క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరు కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈసినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించాడు. చిరు, ర‌వితేజ కామెడీ టైమింగ్‌, హీరోయిజం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. గురువారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 55 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నైజాం ఏరియాలో 7.50 కోట్లు, సీడెడ్‌లో 5.70 కోట్లు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. చిరంజీవి సినిమాకు ఈస్ట్‌లో 3.80 కోట్లు, వెస్ట్‌లో మూడు కోట్ల ప‌ది ల‌క్ష‌లు, గుంటూర్‌లో 2.75 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఓవ‌ర్‌సీస్‌లో 7.25 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఇత‌ర రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల వ‌ర‌కు వాల్తేర్ వీర‌య్య వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఓవ‌రాల్‌గా 55 కోట్ల గ్రాస్‌, 32 కోట్ల షేర్‌ను చిరంజీవి సినిమా క‌లెక్ట్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. తొలి రోజు 32 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డంతో వీకెండ్ లోపు చిరంజీవి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

ఇందులో చిరంజీవి, ర‌వితేజ అన్నద‌మ్ములుగా న‌టించారు. త‌న స‌వ‌తి త‌మ్ముడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన క్రిమిన‌ల్స్‌పై వాల్తేర్ వీర‌య్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే క‌థ‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు బాబీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

IPL_Entry_Point