తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Matti Katha Review: మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?

Matti Katha Review: మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

11 November 2023, 6:09 IST

google News
  • Matti Katha Movie Review: తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన మరో సినిమానే మట్టికథ. ప్రస్తుతం మట్టికథ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్‌లో 9 అవార్డ్స్ గెలుచుకున్న మట్టి కథ రివ్యూలోకి వెళితే..

మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?
మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?

మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: మట్టికథ

నటీనటులు: అజయ్ వేద్, మాయ, కనకవ్వ, బలగం సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, బల్వీర్ సింగ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సాయినాథ్

ఎడిటింగ్: ఉదయ్ కుంబం

సంగీతం: స్మరణ్ సాయి

నిర్మాత: అన్నపరెడ్డి అప్పిరెడ్డి

దర్శకత్వం: పవన్ కడియాలా

థియేటర్ విడుదల తేది: సెప్టెంబర్ 22, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: అక్టోబర్ 13, 2023

ఓటీటీ వేదిక: ఆహా

Matti Katha Movie Review In Telugu: అచ్చమైన పల్లెటూరి సినిమాగా వచ్చింది మట్టికథ. సినిమా విడుదలకు ముందే ఇండో ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా 9 అవార్డ్స్ సాధించి అట్రాక్ట్ చేసింది ఈ మూవీ. బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్, డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ వంటి తదితర కేటగిరీల్లో అవార్డులు వరించిన మట్టికథ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న మట్టికథ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

భూమయ్య (అజయ్ వేద్), రాజు, శీను (అక్షయ్ సాయి), యాదగిరి (రాజు ఆలూరి) నలుగురు మంచి స్నేహితులు. స్కూల్‌లో చదువుకుంటారు. కానీ, వారికి చదువుపై పెద్దగా శ్రద్ధ ఉండదు. ఎప్పుడు అల్లరిగా తిరుగుతూ ఉంటారు. అదే స్కూల్‌లో ఉన్న రాజీ (మాయ)ని భూమయ్య ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో పరీక్షల్లో లీక్ చేసిన క్వశ్చన్ పేపర్‌తో కాపీ కొట్టడంతో భూమయ్య, రాజు, శీనులను ఇన్విజిలేటర్‌గా వచ్చిన పీటీ సార్ నర్సయ్య (దయానంద్ రెడ్డి) డిబార్ చేయిస్తాడు.

ఆసక్తిర విషయాలు

డిబార్ అయిన ఈ ముగ్గురు స్నేహితుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? భూమయ్య తన స్నేహితులతో కలిసి చేసిన తప్పు ఏంటీ? పీటీ సార్ నర్సయ్యకు భూమయ్యకు ఉన్న గొడవ ఏంటీ? రాజీ తండ్రి భూమయ్య పొలాన్ని చేజిక్కుంచుకునేందుకు ఎలాంటి ప్లాన్ వేశాడు? చదువు మానేసి యాదగిరి వాచ్‌మన్‌గా ఎందుకు పని చేయాల్సి వచ్చింది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ మట్టికథ చూడాల్సిందే.

విశ్లేషణ:

మట్టికథ సినిమా అంతా 90వ దశకంలో జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవన విధానం, భూమి, వ్యవసాయమే జీవణాధారం, పొలమే ప్రాణం అని పల్లెల్లో ప్రజలు ఎలా భావిస్తారో భావోద్వేగంగా మట్టికథలో చూపించారు. అప్పుడు ఆడిన ఆటలు, విద్యా సంస్థల తీరు, అన్యాయంగా భూములు చేజిక్కించుకునే భూస్వాముల వ్యవహార శైలిని చాలా బాగా చూపించారు. అలాగే భూమయ్య తన స్నేహితులతో చేసే పనులు, రాజీతో ప్రేమాయణం వంటి విషయాలు బాగున్నాయి.

90వ దశకంలో

స్కూల్‌లో విద్యార్థుల పట్ల టీచర్ల ప్రవర్తన, విద్యార్థులకు ఇచ్చే పనిష్‌మెంట్ 90స్ కాలంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే వారిని గ్రామాల్లో ఎలా చూసేవారు, ఎలా గౌరవం ఇచ్చేవారో, కొత్తగా వచ్చిన సెల్ ఫోన్‌లపై గ్రామస్థులు ఎలా ఇంట్రెస్ట్ చూపించేవారు, వాటికి గురించి తెలియని వారికి తెలిసిన వారు ఎలా డబ్బా కొట్టుకునేవారు వంటివి కళ్లకు కట్టినట్లు చూపించారు. భూస్వాములు భూమి లాక్కొవడంతో ఇల్లు గడవడానికి చిన్న వయసులో పనికి చేరడం, చదవాలని ఉన్నా చదువులేకపోవడం లాంటి సీన్లు బాగున్నాయి.

ఓవరాల్‌గా

అయితే, సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు మన పల్లెల్లోని ప్రజలను, జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. సీన్లు బాగున్నా కొన్ని చోట్ల బోరింగ్ అండ్ రెగ్యూలర్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల కనెక్ట్ కాకపోవచ్చు. కానీ, ఓవరాల్‌గా మూవీ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. పల్లెల్లో భూమిని కన్నతల్లిగా ఎలా చూసుకుంటారో హృద్యంగా చూపించారు. పాటలు అర్థవంతంగా బాగున్నాయి. బీజీఎమ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలు బాగా చూపించారు.

నటీనటులు ఎలా చేశారంటే?

Review Of Matti Katha: ఇక నటీనటుల విషయానికొస్తే అజయ్ వేద్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి అంతా చాలా బాగా చేశారు. మాయ కూడా పల్లెటూరి అమ్మాయిగా, విద్యార్థినిగా ఆకట్టుకుంది. బల్వీర్ సింగ్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. బలగం సుధాకర్ రెడ్డి ఎప్పటిలా అలరించారు. ఇక దయానంద్ పాత్ర కొన్ని స్కూళ్లలో అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించే టీచర్‌లను గుర్తు చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే టేకింగ్ ఎలా ఉన్నా సినిమాలోని పాత్రలు పల్లెటూరి జీవన విధానికి అద్దం పట్టినట్లు చూపించారు.

తదుపరి వ్యాసం