తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manisha Koirala: మణిరత్నం ‘బొంబాయి' వద్దనుకున్న మనీషా కోయిరాల.. ఎందుకో తెలుసా?

Manisha Koirala: మణిరత్నం ‘బొంబాయి' వద్దనుకున్న మనీషా కోయిరాల.. ఎందుకో తెలుసా?

16 August 2022, 12:02 IST

google News
    • నిన్నటి తరం హీరోయిన్ మనీషా కోయిరాల హిందీ, తెలుగు, తమిళంలో ఇలా భాషతో సంబంధం లేకుండా సూపర్ డూపర్ హిట్లు సొంతం చేసుకుంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె తెలిపిన ఓ ఆసక్తికర విషయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం.
మణిరత్నం బొంబాయి
మణిరత్నం బొంబాయి (Twitter)

మణిరత్నం బొంబాయి

90వ దశకంలో స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను పొందిన నటి మనీషా కోయిరాల. హిందీ, తమిళం, తెలుగు ఇలా భాషతో సంబంధం లేకుండా అద్భుతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుందీ బ్యూటీ. అయితే తన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ముంబయి ఒక ఎత్తు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిదా కావాల్సిందే. ఓ ముస్లీం యువతి పాత్రతో పాటు ఇద్దరి పిల్లల తల్లిగా ఆమె పలికించిన హవాభావాలు అద్భుతమనే చెప్పాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది మనీషా. తొలుత ఈ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు(1970 ఆగస్టు 16) సందర్భంగా ఆ ఆసక్తికర విషయమేంటో ఇప్పుడు చూద్దాం.

"నాకు బొంబాయి సినిమా అవకాశమొచ్చినప్పుడు చాలా మంది ఆ సినిమా చేయొద్దని సలహా ఇచ్చారు. 20ల వయస్సులోనే ఇద్దరి పిల్లల తల్లిగా నటిస్తే.. వచ్చే 10 ఏళ్లలో బామ్మ పాత్రలు చేయాల్సి వస్తుందని భయపెట్టారు. కానీ నా మేలుకోరే కొంతమంది సన్నిహితులు మాత్రం మణిరత్నం సినిమా అస్సలు వదులుకోవద్దని, వదులుకుంటే అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోకటి లేదని సూచించారు. దీంతో ఆ సినిమా ఒప్పుకున్నాను. అంగీకరించి మంచి పని చేశానని తర్వాత అనుకున్నాను." అని మనీషా కోయిరాల స్పష్టం చేసింది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బొంబాయి చిత్రం 1994లో విడుదలైంది. అరవింద్ స్వామి హీరోగా నటించగా.. మనీషా కోయిరాల హీరోయిన్. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముంబయిలో జరిగిన మత ఘర్షనల్లో చిక్కుకున్న ఓ జంట ఎదుర్కొన్న సంఘర్షణ గురించి ఈ సినిమా ఉంటుంది.

సంజూ సినిమాతో చిత్రసీమలో రీ ఎంట్రీ గురించి మాట్లాడిన మనీషా కోయిరాలా.. 40ల్లో నటించడం అంత సులువేం కాదని స్పష్టం చేసింది. "నా కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు అలాంటివి రాకూడదనే అనుకుంటున్నాను. మీరు 20ల వయస్సులో ఉన్నప్పుడు మరింత శక్తి, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ 40ల్లోకి వచ్చినప్పుడు కొంచెం నిదానంగా పనిచేయాల్సి ఉంటుంది. మీ ప్రాపంచీక దృక్పథం, ఆలోచనా విధానం మారిపోతుంది. మీరు పూర్తిగా భిన్నమైన వ్యక్తి అవుతారు." అని మనీషా తెలిపింది.

మనీషా కోయిరాల చివరగా సినిమాల్లో సంజయ్ దత్ బయోపిక్ అయిన సంజూలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె రణ్‌బీర్ కపూర్ తల్లి పాత్రలో కనిపించింది. ఇది కాకుండా ఆమె నీరజ్ ఉధ్వానీ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ చిత్రం మస్కాలో నటించింది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న షెహజాదాలోనూ మనీషా కోయిరాల కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం