Mani Ratnam: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి-mani ratnam new movie ponniyin selvam motion poster released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mani Ratnam: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

Mani Ratnam: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Jul 02, 2022 04:30 PM IST

మణిరత్నం కొత్త సినిమా పొన్నియన్ సెల్వన్. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్ (Twitter)

దిగ్గజ దర్శకుు మణిరత్నం తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగం.. సెప్టెంబరు 30న విడుదల కానుంది.

తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మిమ్మల్ని మీరు ధైర్యంగా చూసుకోండి. అడ్వెంచర్‌కు సిద్ధంగా ఉండండి. చోళులు వస్తున్నారు!! అంటూ మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు.

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. 2007లో గురు తర్వాత మణిరత్నంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. భారతీయ సినిమాలో మణిరత్న తనకంటూ ఓ ముద్ర వేసుకున్న దర్శకుడు. ఇప్పటికే ఆయన ఆరు జాతీయ పురస్కారాలను కైవసం చేసుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్