Adi Parvam Review: ఆది పర్వం రివ్యూ - మంచు లక్ష్మి, బిగ్‌బాస్ ఆదిత్య ఓం నటించిన మూవీ ఎలా ఉందంటే?
09 November 2024, 10:32 IST
Adi Parvam Review: మంచు లక్ష్మి, ఆదిత్యం ప్రధాన పాత్రల్లో నటించిన ఆది పర్వం మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు.
ఆది పర్వం రివ్యూ
Adi Parvam Review: లాంగ్ గ్యాప్ తర్వాత మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఆది పర్వం మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్యం ఓం కీలక పాత్రలో నటించాడు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
ఎర్రగుడి కథ...
ఎర్రగుడి చుట్టుపక్కల ఉన్న నలభై ఊళ్లకు రాయప్ప చెప్పింది వేదం. ఎర్రగుడిలో గుప్తనిధులు ఉన్నాయని తెలుసుకుంటాడు రాయప్ప. ఆ నిధిని సొంతం చేసుకువాలని అనుకుంటాడు. ఎర్రగుడి ఎవరి సొంతం అయితే వారే రాయలసీమ గొప్పొళ్లు అని తెలుసుకున్న ఎమ్మెల్యే నాగమ్మ (మంచు లక్ష్మి) కూడా ఎర్రగుడిని తానే అధిపతి కావాలని కలలు కంటుంది.
తన ఇంటిలో పనిచేసే నౌకరు అయిన శ్రీనును బుజమ్మ (శ్రీజిత ఘోష్) ప్రేమిస్తుంది. వారి ప్రేమకు బుజ్జమ్మ తండ్రి అభ్యంతరం చెబుతాడు. పెద్దలను ఎదురించి శ్రీను బుజ్జమ్మ ఎలా ఒక్కటయ్యారు?
వారికి ఎర్రగుడి అమ్మవారు ఎలా అండగా నిలిచింది? క్షుద్ర శక్తులతో ఎర్రగుడిని దక్కించుకోవాలని అనుకున్న నాగమ్మ ప్రయత్నాలను క్షేత్ర పాలకుడు (శివ కంఠంనేని) ఎలా అడ్డుకున్నాడు? మంచికి చెడుకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో గెలుపు ఎవరిని వరించింది? రాయప్ప, బుజ్జమ్మకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఆది పర్వం మూవీ కథ.
ఫిక్షనల్ లవ్ స్టోరీ...
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఫిక్షనల్ యాక్షన్ లవ్‌స్టోరీగా దర్శకుడు సంజీవ్ మేగోటి ఆది పర్వం మూవీని తెరకెక్కించాడు. గుడిలో ఉన్న నిధులను దక్కించుకోవడానికి రెండు వర్గాల మధ్య సాగిన...ఈ మధ్యలో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సంఘర్ణణ నేపథ్యంలో దర్శకుడు ఈ మూవీ కథను రాసుకున్నాడు
పేద, ధనిక అంతరాల 1970-80 దశకాల్లో ఎలా ఉండేవన్నది అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. గుళ్లలో ఉండే చారిత్రక సంపదను దోచుకునేందుకు కొందరు వేసే ఎత్తులను అమ్మవారు ఎలా తప్పికొట్టిందన్నది భక్తి ఎలిమెంట్‌ను టచ్ చేస్తూ మల్టీ జోనర్ మూవీగా ఆది పర్వం సాగుతుంది.
డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో...
మంచి లక్ష్మి, ఆదిత్య ఓం, ఎ స్తేర్‌తో పాటు సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి. ఒక్కో పాత్రను స్క్రీన్‌పైకి తీసుకొస్తూ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో కథను నడిపించడం ఆకట్టుకుంటుంది. లవ్‌స్టోరి నాచురల్‌గా సాగింది.
రొటీన్...
దేవుడిని నిధులను దోచుకోవాలని దుష్ట శక్తులు ప్రయత్నించే కథలో తెలుగులో ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. కొంత వాటి ఛాయలతోనే ఈ మూవీ సాగుతుంది. స్క్రీన్‌ప్లే కొత్తగా రాసుకుంటే బాగుండేది.
మంచు లక్ష్మి వేరియేషన్...
పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లో మంచు లక్ష్మి నటన ఆకట్టుకుంటుంది. నాగమ్మగా, అమ్మవారిగా చక్కటి వేరియేషన్ చూపించింది. నెగెటివ్ రోల్స్ ఆమెకు మంచి యాప్ట్ అని మరోసారి నిరూపించింది. ఆదిత్యం ఓ ఎమోషనల్ రోల్‌లో కనిపించాడు. సుహాసిని, శ్రీజిత ఘోష్‌తో పాటు మిగిలిన నటన ఓకే అనిపిస్తుంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్...
మైథాలజీ, ఫాంటసీ అంశాలను మిక్స్ చేస్తూ వచ్చిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ . మంచు లక్ష్మి యాక్టింగ్ కొంత వరకు ఈ సినిమా ప్లసయ్యింది.
రేటింగ్: 2.5/5