Hitler Review: హిట్లర్ రివ్యూ - విజయ్ ఆంటోనీ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Hitler Review: విజయ్ ఆంటోనీ హిట్లర్ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రియా సుమన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ధన దర్శకత్వం వహించాడు.
Hitler Review: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన హిట్లర్ మూవీ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీలో రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గౌతమ్ మీనన్, చరణ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి మణిరత్నం శిష్యుడు ధన దర్శకత్వం వహించాడు. హిట్టర్ మూవీ ఎలా ఉందంటే...
హిట్లర్ కథ ఇదే…
అసెంబ్లీ ఎలెక్షన్స్ టైమ్ దగ్గరపడుతోన్న టైమ్‌లో సీఏంతో మినిస్టర్ రాజావేల్‌కు(చరణ్ రాజ్) విభేదాలు మొదలవుతుతాయి. ఎలెక్షన్స్‌లో గెలిచి రాష్ట్రానికి తదుపరి సీఏం తానే అవుతానని ముఖ్యమంత్రితో రాజవేల్ ఛాలెంజ్ చేస్తాడు. ఎన్నికల్లో గెలవడం కోసం 300 కోట్ల రూపాయల బ్లాక్‌మనీని ప్రజలకు పంచేందుకు సిద్ధంచేసుకుంటాడు. రాజావేల్ మనుషులను చంపి ఆ బ్లాక్‌మనీని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకుపోతాడు.
రాజావేల్ మనుషులను చంపిన వ్యక్తిని పట్టుకునే బాధ్యతను డీసీపీ శక్తి (గౌతమ్‌మీనన్) తీసుకుంటాడు. మరోవైపు సెల్వ (విజయ్ ఆంటోనీ) ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. సారాతో (రియా సుమన్) సెల్వకు గొడవతో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. సారాతో పెళ్లికి సిద్ధపడతాడు. అదే టైమ్‌లో రాజావేల్ మనుషులను సెల్వనే చంపాడని అతడిని డీసీపీ శక్తి అరెస్ట్ చేస్తాడు.
మినిస్టర్‌ను సెల్వ టార్గెట్ చేయడానికి కారణమేమిటి? రాజావేల్ డబ్బును సెల్వ తన మనుషులతో కలిసి ఎలా కొట్టేశాడు? సారా తండ్రి మరణానికి రాజావేల్‌కు ఉన్న సంబంధమేమిటి? మినిస్టర్ నుంచి కొట్టేసిన డబ్బుతో సెల్వ ఏం చేశాడు? సెల్వ నేరాలను ఆధారాలతో డీసీపీ శక్తి నిరూపించాడా? లేదా? అన్నదే హిట్లర్ మూవీ కథ.
1990ల నాటి కథతో...
ప్రజలను దోచుకొంటూ వారికి అన్యాయం చేసే విలన్....ఆ విలన్ అక్రమమార్గాల్లో కూడబెట్టిన డబ్బును తన తెలివితేటలతో దోచుకునే పేదలకు పంచిపెట్టే ఓసూపర్ హీరో...సదరు హీరోను మంచివాడి నమ్మి ప్రేమించి..ఆ తర్వాత అపార్థం చేసుకొని స్వయంగా పోలీసులకు పట్టించే హీరోయిన్...చివరకు హీరోపై విలన్ గెలవడం...పోలీస్ బకారా కావడం...సింపుల్‌గా మూడు ముక్కల్లో హిట్లర్ మూవీ కథ ఇదే.
హిట్లర్ మూవీ చూస్తున్నంత సేపు 1990 దశకంలో వచ్చిన కొండవీటి దొంగ, జెంటిల్‌మెన్ లాంటి సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంటాయి. రాత, తీతలోనూ హిట్లర్ మూవీ కంటే 1990లో వచ్చిన సినిమాలే బెటర్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
సింపుల్ స్క్రీన్‌ప్లే...
సినిమా ఫస్ట్ సీన్‌తోనే క్లైమాక్స్ ఏమిటన్నది ఈజీగా చెప్పేయచ్చు. అంత సింపుల్‌గా స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు డైరెక్టర్. మినిస్టర్ సొమ్మును హీరో దోచుకునే ప్లాన్స్ సిల్లీగా అనిపిస్తాయి. హీరో దొంగగా మారడానికి కారణం ఏమిటనే కీలకమైన పాయింట్‌ను బలమైన ఎమోషన్స్‌తో రాసుకోలేకపోయాడు డైరెక్టర్.
విజయ్ ఆంటోనీ కిల్లర్ అని గౌతమ్ మీనన్ కనిపెట్టే సీన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. సినిమాలో లాజికల్‌ల గురించి అడగనవసరం లేదు. ఇలా చెప్పుకుంటే పోతే సినిమాలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు సినిమాలో మైనస్‌గా ఎక్కువగా కనిపిస్తాయి.
మణిరత్నం ప్రభావం...
డైరెక్టర్ ధన మణిరత్నం వద్ద శిష్యుడిగా పనిచేశారు. సినిమాలో నాయకానాయికల లవ్‌స్టోరీతో పాటు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ రాసుకునే విషయంలో మణిరత్నం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మణిరత్నం పాత సినిమాలన్నింటిని మిక్స్ చేసి ఈ లవ్ ట్రాక్‌ను రాసుకున్నట్లుగా అనిపిస్తుంది.హిట్లర్ అనే టైటిల్‌కు కథకు ఏ మాత్రం సంబంధం లేదు.
విజయ్ ఆంటోనీ గత సినిమాలే బెటర్...
హిట్లర్ మూవీలో విజయ్ ఆంటోనీకి ఏం నచ్చిందని, ఎలా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడన్నది ఎంతకు అంతుపట్టదు.హిట్లర్ చూసిన తర్వాత గతంలో విజయ్ ఆంటోనీ చేసిన కొన్ని ఫెయిల్యూర్స్ మూవీస్ దీనికంటే బెటర్ అనిపిస్తాయి. అతడి విగ్గు ఎబ్బెట్టుగా ఉంది. గౌతమ్‌మీనన్, చరణ్ రాజ్ రెమ్యునరేషన్ కోసమే ఈ సినిమా చేసిన భావన కలుగుతుంది. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి రియా సుమన్‌ను తీసుకున్నారంటే. రెడీన్ కింగ్స్‌లే ట్రాక్ నవ్వుకుంటే చిరాకే ఎక్కువగా తెప్పిస్తుంది.
ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించడం కష్టమే...
కాలం చెల్లిన కథతో వచ్చిన హిట్లర్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించడం కష్టమే. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఎందుకొచ్చిందన్నది సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది.