Malayalam Thriller OTT: మణిరత్నం మలయాళం అవార్డ్ విన్నింగ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది - ఎందులో చూడాలంటే?
Malayalam Thriller OTT: దిగ్గజ దర్శకుడు మణిరత్నం నిర్మించిన మలయాళం మూవీ పారడైజ్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Malayalam Thriller OTT: మణిరత్నం నిర్మాతగా వ్యవహరించిన మలయాళం మూవీ పారడైజ్ శుక్రవారం ఓటీటీలో రిలీజైంది. థ్రిల్లర్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ప్రసన్న వితానగే దర్శకత్వం వహించాడు. ఈ అవార్డ్ విన్నింగ్ సినిమాలో దర్శనరాజేంద్రన్, రోషన్ మాథ్యూ నాయకానాయికలుగా నటించారు.

రెండు ఓటీటీలలో...
శుక్రవారం పారడైజ్ మూవీ మనోరమా మాక్స్‌తో పాటు సింప్లీసౌత్ ఓటీటీలలో రిలీజైంది. ఇండియన్ ఆడియెన్స్ మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు. జూన్ 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
అంతేకాకుండా బుసాన్, న్యూయార్క్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌తో తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైన పారడైజ్ మూవీ అవార్డులను అందుకున్నది. ఇండో, శ్రీలంక కో ప్రొడక్షన్‌లో ఈ మూవీ రూపొందింది. శ్రీలంక ప్రొడ్యూసర్లతో కలిసి దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ మూవీని నిర్మించారు.
పారడైజ్ కథ ఇదే...
కేశవ్ (రోషన్ మాథ్యూ), అమృత (దర్శన రాజేంద్రన్) తమ పెళ్లి రోజును జరుపుకోవడానికి శ్రీలంక టూర్‌కు వెళతారు. వారి రామాయణ టూర్ ఆనందంగా సాగిపోతుంటుంది. ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధమవుతోన్న టైమ్‌లోనే శ్రీలంకలో అంతర్యుద్ధం మొదలవుతుంది.
అర్థిక సంక్షోభం కారణంగా ప్రజలతో పాటు చట్ట వ్యతిరేక వర్గాలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాయి. తిరుగుబాటు కారణంగా శ్రీలంకలోనే చిక్కుకుపోతారు కేశవ్, అమృత, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు ఎలాంటి పోరాటం చేశారు? అమృత, కేశవ్ ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? శ్రీలంకలో వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అన్నదే పారడైజ్ మూవీ కథ.
93 నిమిషాల నిడివి...
కేవలం 93 నిమిషాల నిడివితోనే దర్శకుడు పారడైజ్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీలో అమృతగా దర్శనరాజేంద్రన్ అసమాన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. పారడైజ్ మూవీలో ఇండియన్ యాక్టర్స్‌తో పాటు పలువురు శ్రీలంక నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సింహళం, మలయాళంతోపాటు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఈ మూవీ రిలీజైంది.
తెలుగులోకి ఎంట్రీ..
యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ మలయాళ హీరోయిన్లలో వైవిధ్యతను చాటుకుంటోంది దర్శనరాజేంద్రన్. ఆమె హీరోయిన్‌గా నటించిన హృదయం, వైరస్, జయ జయ జయ జయహేతో పాటు పలు సినిమాలు కమర్షియల్ సక్సెస్‌లుగా నిలిచాయి.
పరదా మూవీతో దర్శనరాజేంద్రన్. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేంగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో కనిపిస్తోంది. సంగీత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం కమల్‌హాసన్ తో థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు మణిరత్నం. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది