Mamta Mohandas Rare Disease: ఈ టాలీవుడ్ హీరోయిన్ను గుర్తుపట్టారా? అయ్యో.. ఏంటి ఇలా మారిపోయింది!
08 January 2024, 21:35 IST
- Mamta Mohandas Rare Disease: యమదొంగ ఫేమ్ మమతా మోహన్‌దాస్ కొంతకాలం క్రితం క్యాన్సర్‌ను జయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
చర్మసంబంధిత వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్
Mamta Mohandas Rare Disease: జూనియర్ ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాతో టాలీవుడ్లో సూపర్ హిట్ దక్కించుకున్న మమతా మోహన్ దాస్ గుర్తుందా?. 15 ఏళ్ల క్రితం తన అందంతో తెలుగునాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అడపా దడపా సినమాలు చేసుతుంది. ఆ తర్వాత మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన కూడా పడింది. ఆ వ్యాధిని జయించిన ఆమె ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి వార్తల్లో నిలిచింది మమత.
మమతా మోహన్ దాస్ తాను చర్మ సంబంధత వ్యాధి(Vitiligo)తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ నటి పెట్టి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వ్యాధి కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడిటన్లు తెలిపింది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది.
"ప్రియమైన సూర్యుడా.. గతంలో కంటే ఇప్పుడు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నేను రోజూ రంగును కోల్పోతున్నాను. పొగమంచులో మెరిసే నీ కిరణాలను చూసేందుకు ప్రతి ఉదయం చూస్తున్నాను. అవి నన్ను తాకాలని వాటికోసం బయటకు వస్తున్నాను. నాకు ఇప్పుడు వాటి అవసరం ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను." అని తన పోస్టులో పేర్కొంది మమత.
మమతా మోహన్‌దాస్ చేసిన పోస్టుపై నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు ధైర్యం చెబుతున్నారు. మీరు క్యాన్సర్‌ను జయించారు.. ఈ వ్యాధి నుంచి కూడా బయట పడతారని ఆశిస్తున్నారు. మీరు ఫైటర్.. ఇలాంటివి మిమ్మల్ని ఏం చేయలేవు అని ఓ యూజర్ పోస్ట్ పెట్టగా.. ధైర్యంతో ఉండి త్వరగా కోలుకోవాలని మరొకరు స్పందించారు.
ప్రస్తుతం మమత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో రుద్రంగి అనే సినిమా చేస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో పోషకాహర నిపుణురాలిగా చాలా మందికి మార్గనిర్దేశం చేస్తోంది.
టాపిక్