OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ సెటైర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
19 June 2024, 18:56 IST
- Malayalee from India OTT Release Date: మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం వస్తోంది.
OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ సెటైర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Malayalee from India OTT: మలయాళ పొలిటికల్ సెటైర్ డ్రామా మూవీ ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’ ప్రశంసలు దక్కించుకుంది. మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో థియేటర్లలోనూ మంచి కలెక్షన్లు దక్కించుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా జూలై 5వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సోనీలివ్ నేడు (జూన్ 19) అధికారికంగా ప్రకటించింది. అయితే, మలయాళం మినహా డబ్బింగ్ వెర్షన్‍లపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రానికి డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. కేరళ రాజకీయాలపై సెటైరికల్‍గా ఈ మూవీని తెరకక్కించారు. ఈ మూవీని కామెడీతో ఎంటర్‌టైనింగ్‍గా రూపొందించారు. నివిన్ పౌలీ, శ్రీనివాసన్, అనస్వరతో పాటు దీపక్ జేతీ, సలీమ్ కుమార్, మంజు పిళ్లై, షైన్ టామ్ చాకో, సంతోష్ జీ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.
మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాను మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ మూవీకి విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలే రాగా.. కమర్షియల్‍గానూ మంచి వసూళ్లు సాధించింది.
మలయాళీ ఫ్రమ్ ఇండియా స్టోరీ లైన్
ఆల్పరంబిల్ గోపీ (నివిన్ పౌలీ) నిరుద్యోగిగా ఉంటాడు. క్రికెట్ ఆడడం, ఓ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం చేస్తుంటాడు. స్నేహితుడు మాల్‍గోష్ (ధ్యాన్ శ్రీనివాసన్)తో కలిసి తిరుగుతుంటాడు. అయితే, ఓ ఘటనను సరిగా ఎవరూ అర్థం చేసుకోని కారణంగా ఆ గ్రామంలో హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. గోపీ, మాల్‍గోష్ కూడా చెరో వర్గం నుంచి గొడవలకు దిగుతారు. దీంతో పోలీసులు, దాడులకు పాల్పడే వారి నుంచి కాపాడేందుకు గోపీని విదేశాల్లో పని చేసేందుకు పంపుతారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ పొరపాటును గోపి, మాల్‍గోష్ గుర్తించారా? గోపీలో వచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
కేరళలోని మత రాజకీయాలపై సెటైరికల్‍గా కామెడీ కలగలిపి మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు డిజో జోస్ ఆంథోనీ. ఈ మూవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
వర్షంగల్కు శేషం
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ హీరోగా నటించిన వర్షంగల్కు శేషం సినిమా జూన్ 7వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ప్రణవ్ మోహన్‍లాల్‍తో పాటు ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్శి, నివిన్ పౌలీ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. వర్షంగల్కు శేషం చిత్రానికి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు.