తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

28 August 2024, 23:23 IST

google News
    • Nunakkuzhi OTT Release Date: నునకుళి సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ట్విస్టులతో ఉండే ఈ క్రైమ్ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ లీడ్ రోల్ చేశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు రానుందంటే..
OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

మలయాళ స్టార్ డైరెక్టర్ జితూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘నునకుళి’ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్రైమ్ కామెడీ సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ మోస్తరు కలెక్షన్లు దక్కించుకుంది. ఈ నునకుళి చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

స్ట్రీమింగ్ తేదీ

‘నునకుళి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

సెప్టెంబర్ 13న నునకుళి చిత్రం జీ5లో మలయాళంలో మాత్రమే వస్తుందా.. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం.. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

నునకుళి మూవీలో బాసిల్ జోసెఫ్, గ్రేస్‍తో పాటు సిద్ధిఖీ, బైజూ సంతోష్, నిఖిల విమల్, మనోజ్ కే జయన్, అల్తాఫ్ సలీం, బినూ పప్పు, అజీజ్ నడుమగ్డన్, అజు వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జితూ జోసెఫ్ తెరకెక్కించారు. ట్విస్టులతో ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎంగేజింగ్‍గా రూపొందించారు. సీక్రెట్స్ ఉన్న ల్యాప్‍టాప్‍ను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ సినిమాను దర్శకుడు నడిపించారు.

నునకుళి మూవీని యూడ్లీ ఫిల్మ్స్, సరేగామ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి జై ఉన్నితన్, విష్ణు శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా చేశారు. సతీశ్ కురుప్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి వీఎస్ వినాయక్ ఎడిటింగ్ చేశారు.

నునకుళి స్టోరీలైన్

తన తండ్రి మరణించటంతో ఇబీ జచారియా (బాసిల్ జోసెఫ్) కంపెనీ బాధ్యతలను చేపడతాడు. కొత్తగా పెళ్లి కావటంతో భార్య రిమి (నిఖిల విమల్) మోజులోనే అతడు ఉంటాడు. పెద్దగా వ్యాపారాన్ని పట్టించుకోడు. తాము శృంగారం చేసుకుంటున్న వీడియోను తన వ్యక్తిగత ల్యాప్‍టాప్‍లో ఉంచేందుకు తన భార్యను ఓ రోజు ఒప్పిస్తాడు ఇబీ. ఆ వీడియోను ల్యాప్‍టాప్‍లో స్టోర్ చేస్తాడు. అయితే, అనుకోకుండా ఇబీ ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుంది. ఆ ల్యాప్‍టాప్‍ను ఐటీ ఆఫీసర్ భామకృష్ణన్ (సిద్దిఖీ) సీజ్ చేస్తారు.

దీంతో తమ పర్సనల్ వీడియో ఉన్న ఆ ల్యాప్‍టాప్‍ను తిరిగి తీసుకురాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఇబీని రిమి బెదిరిస్తుంది. దీంతో ల్యాప్‍టాప్‍ను తీసుకొచ్చేందుకు రెష్మిత (గ్రేస్ ఆంటోనీ)తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు ఇబీ. ఈ క్రమంలో మరిన్ని చిక్కుల్లో పడతాడు. కొన్ని తప్పుడు ఆరోపణల్లోనూ ఇబీ ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సమస్యలను నుంచి ఇబీ బయటపడ్డాడా? ఆ ల్యాప్‍టాప్‍ను తిరిగి సొంతం చేసుకోగలిగాడా? అనే అంశాలు నునకుళి మూవీలో ప్రధానంగా ఉంటాయి. ట్విస్టులు, డ్రామా, కామెడీతో ఈ చిత్రం సాగుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం