Malaika Arora Father: షాకింగ్.. స్టార్ హీరోయిన్ తండ్రి ఆత్మహత్య.. బిల్డింగ్ పైనుంచి దూకి..
11 September 2024, 15:54 IST
- Malaika Arora Father: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీని వెనుక కారణం మాత్రం ఇంకా తెలియలేదు.
షాకింగ్.. స్టార్ హీరోయిన్ తండ్రి ఆత్మహత్య.. బిల్డింగ్ పైనుంచి దూకి..
Malaika Arora Father: మలైకా అరోరా తండ్రి అనీల్ అరోరా ఆత్యహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న బిల్డింగ్ లో ఆరో అంతస్తు నుంచి అతడు దూకి ఆత్యహత్య చేసుకున్నట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించింది. అయితే అది ఆత్మహత్య కాదని, ప్రమాదమని మలైకా సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు కూడా పీటీఐ తన రిపోర్టులో తెలిపింది.
మలైకా అరోరా తండ్రి ఆత్యహత్య
మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రి అయిన అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు బాలీవుడ్ ను షాక్ కు గురి చేశాయి. ఆరో అంతస్తు నుంచి అతడు దూకాడని, వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లినా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మోడల్, నటి అయిన మలైకా అరోరాతోపాటు మరో నటి అమృతా అరోరా కూడా సునీల్ అరోరా కూతుళ్లే. అతడు చనిపోయిన విషయం తెలియగానే మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ వెంటనే అక్కడికి వెళ్లాడు.
మలైకా అరోరా ఫ్యామిలీ ఇదీ..
మలైకా అరోరా తండ్రి అనీల్ అరోరా, ఆమె తల్లి జాయ్స్ పోలీకార్ప్ చాలా రోజుల కిందటే విడిపోయారు. అప్పటికి మలైకా వయసు 11 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మలైకా తన తల్లి, చెల్లి అమృతతో కలిసి చెంబూర్ వెళ్లింది. మలైకా తల్లి జాయ్స్ ఓ మలయాళీ క్రిస్టియన్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ హిందు. గతంలో ఇండియన్ మర్చంట్ నేవీలో పని చేశాడు.
అటు మలైకా చెల్లెలు అమృత అరోరా కూడా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆమె 2009లో వ్యాపారవేత్త షకీల్ లడక్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక మలైకా కూడా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ తో 19 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2016లో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె అర్జున్ కపూర్ తోనూ రిలేషన్షిప్ లో ఉన్నా.. తర్వాత వీళ్ల జంట కూడా విడిపోయింది.