Malaika Arora Breakup: మలైకా అరోరా బ్రేకప్.. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత తొలిసారి కెమెరా ముందుకు..
Malaika Arora Breakup: బాలీవుడ్ కపుల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ బ్రేకప్ చెప్పేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో తొలిసారి మలైకా కెమెరాల ముందుకు వచ్చింది.

Malaika Arora Breakup: బాలీవుడ్ లో మరో కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారు. తన కంటే ఎంతో చిన్న వాడైన అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో పడిన 50 ఏళ్ల మలైకా అరోరా.. ఇప్పుడతనితో విడిపోయింది. ఈ ఇద్దరూ ఎంతో హుందాగా ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రేకప్ న్యూస్ తర్వాత తొలిసారి మలైకా కెమెరాల ముందుకు వచ్చింది.
నవ్వుతూ వెళ్లిపోయిన మలైకా
మలైకా అరోరా శుక్రవారం (మే 31) ముంబైలోని బాంద్రా ఏరియాలో కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లను చూసి ఆమె నవ్వుతూ వెళ్లిపోయింది. మామూలుగా అయితే ఆమె ఎప్పుడు కనిపించినా.. ఫొటోలకు పోజులివ్వడం, అభిమానులతో సెల్ఫీలు దిగడం చేసేంది. కానీ ఈసారి మాత్రం సింపుల్ గా ఓ నవ్వు నవ్వి ఎక్కువ సేపు ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఫొటోగ్రాఫర్లు కాస్త ఆగమని అంటున్నా.. ఆమె మాత్రం హడావిడిగా వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీడియా ముందుకు వస్తే కచ్చితంగా అర్జున్ కపూర్ తో బ్రేకప్ గురించి అడుగుతారని ఆమె భావించి ఉండవచ్చు. మరోవైపు అర్జున్, మలైకా పరస్పర అంగీకారంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్లు పింక్‌విల్లా రిపోర్టు వెల్లడించింది.
ఆరేళ్లు కలిసి ఉన్న తర్వాత..
తమ బ్రేకప్ పై మౌనంగా ఉండాలని అర్జున్, మలైకా నిర్ణయించినట్లు కూడా ఆ రిపోర్టు తెలిపింది. ఈ బ్రేకప్ వార్తలకు మలైకా చేసిన ఓ పోస్ట్ కూడా మరింత ఊతమిస్తోంది. ఓ సందేశాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. "గుడ్ మార్నింగ్.. మనల్ని ప్రేమించే, మనకు మద్దతుగా నిలిచే వాళ్లే ప్రపంచంలో మన అతిపెద్ద నిధి. వాళ్లను వేరే వాళ్లతో భర్తీ చేయలేం. కొనలేం. మనందరికీ అలాంటి వాళ్లు చాలా కొద్ది మందే ఉన్నారు" అని మలైకా పోస్ట్ చేసింది.
తమ బ్రేకప్ పై ఇప్పటి వరకూ మలైకాగానీ, అర్జున్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఈ ఇద్దరూ 2018లో తమ మధ్య ఉన్న బంధాన్ని పబ్లిగ్గా వెల్లడించారు. అర్జున్ తన కంటే వయసులో చాలా చిన్నవాడు. అలాంటి వ్యక్తితో డేటింగ్, లివిన్ రిలేషన్షిప్ ఏంటన్న విమర్శలూ వచ్చాయి. అయితే ఈ జంట మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
పైగా అప్పటికే అర్బాజ్ ఖాన్ తో మలైకాకు ఓ తనయుడు కూడా ఉన్నాడు. అతనితో విడిపోయిన తర్వాత ఆమె అర్జున్ కు దగ్గరైంది. 1998లో బాలీవుడ్ లో వచ్చిన దిల్ సే మూవీలో ఛయ్య ఛయ్య పాట ద్వారా దేశాన్ని ఊపేసింది మలైకా అరోరా. అంతకుముందు కొన్ని టీవీ షోలు కూడా చేసింది. దిల్ సే హిట్ అయిన తర్వాత మలైకాకు బాలీవుడ్ లో కొన్ని ఆఫర్లు వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం అర్జున్ కపూర్ సింగం అగైన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ కూడా నటిస్తున్నాడు.