తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Plans To Vacation: మళ్లీ వెకేషన్‌కు ప్లాన్ చేసిన మహేష్.. త్రివిక్రమ్‌తో మూవీకి చిన్న బ్రేక్

Mahesh Plans to Vacation: మళ్లీ వెకేషన్‌కు ప్లాన్ చేసిన మహేష్.. త్రివిక్రమ్‌తో మూవీకి చిన్న బ్రేక్

02 April 2023, 19:14 IST

google News
    • Mahesh Plans to Vacation: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి వెకేషన్‌కు ప్లాన్ చేశారు. త్రివిక్రమ్‌తో ఆయన చేస్తున్న సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి పారిస్‌కు వెళ్తున్నట్లు సమాచారం. 15 రోజుల పాటు సెలవులు తీసుకోనున్నారు మహేష్.
మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్
మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ (Mohammed Aleemuddin )

మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్

Mahesh Plans to Vacation: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడుపుతారనే సంగతి అందరికీ తెలిసిందే. కాస్త గ్యాప్ వచ్చినా సరే వెంటనే చిన్నపాటి వెకేషన్‌కు ప్లాన్ చేస్తారు. ఇలా ఈ విధంగా ఏడాదికి నాలుగైదు సార్లకు పైనే హాలీడేకు వెళ్తుంటారు మన మహేష్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తుండగా.. తాత్కాలికంగా ఈ సినిమాకు బ్రేక్ ఇస్తూ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో ఆయన పారిస్‌ హాలీడేకు వెళ్లనున్నట్లు సమాచారం.

పారిస్‌లో మహేష్ 15 రోజుల పాటు ఉండనున్నారట. ఇప్పటికే మహేష్ సతీమణి నమ్రత, కుమార్తే సితార పారిస్‌కు చేరుకున్నారు. అనంతరం మహేష్ కూడా వారితో కలవనున్నారు. 15 రోజుల పాటు సెలవుల్లో ఉండనున్న మన సూపర్ స్టార్.. ఏప్రిల్ నాలుగో వారంలో తిరిగి SSMB28 షూటింగ్‌లో పాల్గొననున్నారు. వేసవిలో బయట పనిచేయడాన్ని పెద్దగా ఇష్టపడని ఆయన..ఈ కొత్త షెడ్యూల్ కోసం ఎయిర్ కండీషన్డ్ సెట్‌లో ఇండోర్ షూట్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్ ముచ్చటగా మూడోసారి నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. పొడవాటి జుట్టుతో మహేష్ సరికొత్తగా కనిపించనున్నారు. అభిమానులు ఆయనును హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్‌తో పోలుస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2024న జనవరి 13న విడుదల కానుంది.

తదుపరి వ్యాసం