Mahesh Babu in New Look: మహేష్ కొత్త లుక్ అదుర్స్ - సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
13 October 2022, 11:08 IST
Mahesh Babu in New Look: త్రివిక్రమ్ సినిమాలో కొత్త లుక్‌లో మహేష్‌బాబు కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకవర్ అవుతున్న ఫొటోను అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మహేష్‌బాబు
Mahesh Babu in New Look: త్రివిక్రమ్ సినిమాలో కొత్త లుక్‌లో మహేష్‌బాబు కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం స్టైలిష్‌గా మేకోవర్ అవుతున్నాడు. అతడు, ఖలేజా తర్వాత హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తనదైన శైలి ఫన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్‌ను జోడించి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
గత నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత మహేష్‌బాబు మదర్ ఇందిరాదేవి మరణంతో షూటింగ్‌ను పదిహేను రోజుల పాటు వాయిదావేశారు.
త్వరలోనే తిరిగి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు మహేష్‌బాబు రెడీ అవుతున్నాడు. లైడ్ బియర్డ్, కర్లీ హెయిర్ స్టైల్‌తో డిఫరెంట్ లుక్‌లో మహేష్‌బాబు కనిపిస్తున్న ఫొటోను హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ఫొటోలో స్టైలిష్‌గా సరికొత్త అవతారంలో మహేష్‌బాబు కనిపిస్తున్నారు. మహేష్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట కంపోజింగ్ పూర్తయినట్లు ఇటీవల తమన్ ప్రకటించాడు.
త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు మహేష్‌బాబు. వచ్చే ఏడాది మహేష్, రాజమౌళి సినిమా సెట్స్‌పైకిరానుంది.