తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Holiday: వెకేషన్‌కు ప్లాన్ చేసిన మహేష్.. ఫ్యామిలీతో మరోసారి ట్రిప్

Mahesh Babu Holiday: వెకేషన్‌కు ప్లాన్ చేసిన మహేష్.. ఫ్యామిలీతో మరోసారి ట్రిప్

09 February 2023, 17:43 IST

    • Mahesh Babu Holiday: సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతాతో కలిసి హాలీడేకు ప్లాన్ చేశారు. ఈ సారి స్విట్జర్లాండ్‌లో రెండు వారాల పాటు రిలాక్స్ అవనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మన మహేష్.
నమ్రతాతో కలిసి వెకేషన్ కు వెళ్తున్న మహేష్ బాబు
నమ్రతాతో కలిసి వెకేషన్ కు వెళ్తున్న మహేష్ బాబు

నమ్రతాతో కలిసి వెకేషన్ కు వెళ్తున్న మహేష్ బాబు

Mahesh Babu Holiday: సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం ఖాళీ దొరికినా హాలీడేకు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహారయాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. సంవత్సరంలో కనీసం మూడు, నాలుగు సార్లు ఇలాంటి ట్రిప్స్‌కు వెళ్లడం ఆయన డైరీలో అలవాటుగా ఉండిపోతుంది. తాజాగా మరోసారి మహేష్.. వెకేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే ఈ సారి భార్య నమ్రతా శిరోద్కర్‌తో ట్రిప్‌కు ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ సందడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

తన భార్య నమ్రతాతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు మహేష్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దంపతులు రెండు వారాల పాటు అక్కడ రిలాక్సై తిరిగి భారత్‌కు రానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ విమానాశ్రయంలో వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సెక్యురిటీ చెకప్ వద్ద, స్టాఫ్‌తో కలిసి కనిపించిన ఈ వీడియో విస్తృతంగా తిరుగుతోంది.

మహేష్ బ్యాగీ ప్యాంట్‌తో పటు బ్లూ స్వెట్ షర్ట్‌తో కూడిన మ్యాచింగ్ జాకెట్ ధరిచారు. మరోపక్క నమ్రత బ్లూ జీన్, వైట్ షర్టుతో కూడిన ఆరెంజ్ స్వెటర్ ధరించారు. ఇద్దరూ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఆకర్షణీయంగా కనిపించారు. రెండు వారాల పాటు వెకేషన్‌లో చిల్ అయిన తర్వాత తిరిగి ఇక్కడకు రానున్నారు మన మహేష్.

త్రివిక్రమ్ కాంబోలో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాస్త గ్యాప్ రావడంతో ఆ విరామంలో మన సూపర్‌స్టార్ ఈ విధంగా ఫ్యామిలీతో వెకేషన్‌కు ప్లాన్ చేశారు. వెకేషన్ తర్వాత షూటింగ్ మళ్లీ మొదలవుతుంది.

అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్ ముచ్చటగా మూడోసారి నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. పొడవాటి జుట్టుతో మహేష్ సరికొత్తగా కనిపించనున్నారు. అభిమానులు ఆయనును హాలీవుడ్ హీరో కీనూ రీవ్స్‌తో పోలుస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.

త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. గ్లోబ్ ట్రాట్ అడ్వెంచర్ సినిమాగా ఇది రాబోతుంది. ప్రముఖ రచయిత వీవీ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించనున్నారు. వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం