తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhokha Round D Corner Teaser: ధోకా మూవీ టీజర్‌ రిలీజ్‌లో మాధవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Dhokha Round D Corner Teaser: ధోకా మూవీ టీజర్‌ రిలీజ్‌లో మాధవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

17 August 2022, 16:49 IST

google News
    • Dhokha Round D Corner Teaser: తమిళ సూపర్‌స్టార్‌ మాధవన్‌ నటిస్తున్న నెక్ట్స్‌ మూవీ ధోకా- రౌండ్‌ ది కార్నర్‌. ఈ మూవీ టీజర్‌ బుధవారం (ఆగస్ట్ 17) రిలీజ్‌ కాగా.. ఇందులో అతడు కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.
ధోకా రౌండ్ ది కార్నర్ టీజర్ రిలీజ్ లో మాధవన్, ఇతర నటులు, దర్శకుడు
ధోకా రౌండ్ ది కార్నర్ టీజర్ రిలీజ్ లో మాధవన్, ఇతర నటులు, దర్శకుడు

ధోకా రౌండ్ ది కార్నర్ టీజర్ రిలీజ్ లో మాధవన్, ఇతర నటులు, దర్శకుడు

రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ మూవీ సక్సెస్‌ తర్వాత తమిళ సూపర్‌ స్టార్‌ మాధవన్‌ హుషారుగా ఉన్నాడు. తన డైరెక్షన్‌లో తానే నటించిన ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజై సక్సెసైంది. ఇండియాకు క్రయోజనిక్‌ ఇంజిన్ల ప్రాముఖ్యతను చాటి చెప్పిన ప్రముఖ ఇస్రో సైంటిస్ట్‌ నంబి నారాయనణన్‌పై జరిగిన కుట్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీ సక్సెస్‌ తర్వాత మాధవన్‌ ఇప్పుడు ధోకా - రౌండ్‌ ది కార్నర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ బుధవారం (ఆగస్ట్‌ 17) రిలీజైంది. ఇది ఆడియెన్స్‌ బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌ను మూవీ డైరెక్టర్‌ కూకీ గులాటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేస్తూ.. ఇక్కడ ప్రతి మూలా ఓ మోసం జరుగుతూనే ఉంటుంది. సెప్టెంబర్‌ 23న థియేటర్లలోకి వస్తోంది. మోసపోవడానికి సిద్ధంగా ఉండండి అని క్యాప్షన్‌ పెట్టాడు. టీజర్‌ రిలీజైన వెంటనే ట్విటర్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లడం విశేషం.

మాధవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

అయితే ధోకా - రౌండ్‌ ది కార్నర్‌ మూవీ టీజర్‌ రిలీజ్‌లో భాగంగా మాధవన్‌ థియేటర్లు మూతపడుతుండటంపై కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఎలా మానేశారో అతడు చెప్పాడు. ఓ సినిమా కోసం నాలుగు గంటలు కేటాయించే సమయం ఎవరి దగ్గరా లేదని, అందుకే థియేటర్లు మూతపడుతున్నాయని అన్నాడు.

ఇక థియేటర్ల దగ్గర ఈ కాలంలో ఉండాల్సిన వసతులు లేకపోవడం కూడా ప్రధాన కారణమని మాధవన్‌ చెప్పాడు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కార్లలో వస్తున్నారని, ఇది పెద్ద సమస్య అని అన్నాడు. థియేటర్లు మూత పడటానికి సినిమాల వైఫల్యం కంటే వసతుల లేమే కారణమని అతడు అనడం విశేషం. వసతులు సరిగా లేని థియేటర్లే ఎక్కువగా మూత పడుతున్న విషయాన్ని గమనించాలని తెలిపాడు. అయినా పాత థియేటర్లు మూతపడినప్పుడే కొత్తవి, అధునాతమైనవి వస్తాయని అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం